ఎట్టకేలకు గోపీచంద్‌ కు జత కుదిరింది

Update: 2019-05-04 16:36 GMT
హీరో గోపీచంద్‌, తమిళ దర్శకుడు తిరుల కాంబినేషన్‌ లో అనీల్‌ సుంకర ఒక చిత్రంను నిర్మించేందుకు సిద్దం అయిన విషయం తెల్సిందే. అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్ర కోసం మొదట సాహేషా సైగల్‌ ను ఎంపిక చేశారు. ఆమె కూడా ఓకే చెప్పింది. అయితే తమిళ హీరో ఆర్యతో ఆమె వివాహం అవ్వడం, ఆ తర్వాత పరిణామాల కారణంగా గోపీచంద్‌ సినిమాను ఆమె క్యాన్సిల్‌ చేసుకుంది. సాహేషా తప్పుకోవడంతో ఆమె స్థానంలో హన్సిక లేదా కేథరిన్‌ తెర్సాతో పాటు ఇంకా కొందరిని పరిశీలించారు. కాని వారెవ్వరు కూడా ఈ చిత్రంకు పైనల్‌ కాలేదు. చివరకు తమన్నా వద్దకు కూడా అనీల్‌ సుంకర వెళ్లినట్లుగా తెలుస్తోంది.

'ఎఫ్‌ 2' సూపర్‌ హిట్‌ తో తమన్నా రేంజ్‌ ఒక్కసారిగా పెరిగి పోయింది. దాంతో ఆమెకు ఏకంగా రెండు కోట్ల పారితోషికం ఇచ్చి గోపీచంద్‌ తో నటింపజేసేందుకు ప్రయత్నాలు చేశారు. మొదట ఓకే చెప్పిన తమన్నా ఆ తర్వాత నో చెప్పిందట. దాంతో మళ్లీ అనీల్‌ సుంకర హీరోయిన్‌ వేట మొదలైంది. తాజాగా మెహ్రీన్‌ వద్దకు వెళ్లి ఆయన అన్వేషణ ఆగినట్లుగా తెలుస్తోంది.

గోపీచంద్‌ తో గతంలో మెహ్రీన్‌ ఒక చిత్రంలో నటించింది. ఆ సినిమాలో ఇద్దరి కాంబోకు మంచి మార్కులే పడ్డాయి. దాంతో పాటు తాజాగా 'ఎఫ్‌ 2' చిత్రంలో హనీగా నటించి అమ్మడు తన క్రేజ్‌ ను అమాంతం పెంచుకుంది. అందుకే మెహ్రీన్‌ ను గోపీచంద్‌ కు జోడీగా ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంను ఇదే ఏడాదిలో విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. గోపీచంద్‌ గత కొంత కాలంగా కమర్షియల్‌ సక్సెస్‌ కోసం చకోరా పక్షి తరహాలో ఎదురు చూస్తున్నాడు. ఈ చిత్రంతో ఆయన సక్సెస్‌ కొడతాననే నమ్మకంతో ఉన్నాడు.
Tags:    

Similar News