రామ్ చ‌ర‌ణ్ తో జెర్సీ ద‌ర్శ‌కుడు

Update: 2020-02-02 13:30 GMT
మ‌ళ్లీరావా- జెర్సీ చిత్రాల‌తో ఎమోష‌న‌ల్ ల‌వ్ స్టోరీస్ ని తెర‌కెక్కించ‌గ‌ల‌ స‌మ‌ర్థుడు అని నిరూపించుకున్నాడు గౌత‌మ్ తిన్న‌నూరి. చేసిన రెండు సినిమాల‌తో టాలీవుడ్ లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించుకున్నాడు. సెన్సిబుల్ ల‌వ్ స్టోరీలో అద్భుత‌మైన ఎమోష‌న్ ని ఎలివేట్ చేయ‌గ‌ల ద‌ర్శ‌కుడు. అందుకే ద‌ర్శ‌కుడిగా రెండు సినిమాల‌తోనే  హీరో- నిర్మాత‌ల దృష్టిని ఆక‌ర్షించాడు. వాస్త‌వానికి ఆ రెండు సినిమాలు యావ‌రేజ్ గా ఆడిన‌వే అయినా కంటెంట్ ప‌రంగా..మేకింగ్ ప‌రంగా గౌత‌మ్ యూనిక్ అన్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి. అందుకే జెర్సీ చిత్రాన్ని ఇరుగు పొరుగు భాష‌ల్లోనూ రీమేక్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం జెర్సీ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నాడు. మాతృక‌లో న‌టించిన నాని పాత్ర‌లో షాహిద్ క‌పూర్ న‌టిస్తున్నాడు. ఈ రీమేక్ ని అల్లు అర‌వింద్-దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. మ‌రి ఈ చిత్రం త‌ర్వాత గౌత‌మ్ త‌దుప‌రి ఏ హీరోతో సినిమా చేయ‌నున్నాడు? అంటే  ఆసక్తిక‌ర అప్ డేట్ అందింది.  మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో ఓ భారీ సినిమాకు స‌న్నాహాకాలు చేస్తున్న‌ట్లు తెలిసింది. ఇప్ప‌టికే ఒక సారి ఇరువురి మ‌ధ్య స్ర్కిప్ట్ చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్లు స‌మాచారం. ఈ చిత్రాన్ని ఎ న్. వి ప్ర‌సాద్ నిర్మించడానికి వ‌చ్చారట‌. ఈ వాస్త‌వానికి ఈ ప్రాజెక్ట్ మూవ్ అవ్వ‌డానికి అస‌లు కార‌ణం ఎన్.వి ప్ర‌సాద్ అనే తెలుస్తోంది.

జెర్సీ ప్రారంభానికి  ముందే  ఎన్. వి. ప్ర‌సాద్- గౌత‌మ్ కి అడ్వాన్స్ గా కొంత  పారితోషికం  చెల్లించారట. అటుపై జెర్సీ సినిమాకు వ‌చ్చిన ఫీడ్ బ్యాక్ నేప‌థ్యంలో అప్ప‌టి నుంచి  స‌ద‌రు నిర్మాత గౌత‌మ్ కి ట‌చ్ లో ఉన్న‌ట్లు  తెలుస్తోంది. త్వ‌ర‌లోనే రామ్ చ‌ర‌ణ్‌- గౌత‌మ్ మ‌ధ్య  ఎన్ . వి ప్ర‌సాద్ ఓ మీటింగ్ ఏర్పాటు చేయ‌నున్నారుట‌. ఈ స‌మావేశం త‌ర్వాత ఈ ప్రాజెక్ట్ పై  ఓ  క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది. అన్ని అనుకున్నట్లు జ‌రిగితే వ‌చ్చే ఏడాది  సినిమా ప్రారంభం కానుంద‌ని  అంటున్నారు. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ ఆర్ ఆర్ ఆర్ చిత్రీక‌ర‌ణ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.


Tags:    

Similar News