నందమూరి బాలకృష్ణ కెరీర్లో ఇప్పటిదాకా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ‘లెజెండ్’ సినిమా ఫుల్ రన్లో రూ.42 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఐతే బాలయ్య వందో సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మీద ఏకంగా రూ.60 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టేయానికి రెడీ అయిపోయాడు దర్శక నిర్మాత క్రిష్. తాను అనుకున్నట్లుగా సినిమా కూడా పూర్తి చేశాడు. ముందు నుంచి సినిమాను బాగా ప్రమోట్ చేసి హైప్ తీసుకొచ్చి.. సినిమాను భారీ రేట్లకే అమ్మాడు. ఐతే బాలయ్య మార్కెట్ పరిధిని బట్టి చూస్తే బయ్యర్లకు పంచ్ పడుతుందేమో అని చాలామంది సందేహించారు. కానీ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ అంచనాల్ని మించి వసూళ్లతో అదరగొడుతోంది. బయ్యర్లందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు.
నైజాం ఏరియాలో ‘శాతకర్ణి’ని కొన్న నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా ఫస్ట్ కాపీ చూడగానే ఇది బాలయ్య కెరీర్లో రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లు సాధిస్తుందని అంచనా వేశాను. నా మాటే నిజమై ఇప్పుడీ సినిమా అదిరిపోయే వసూళ్లు రాబడుతోంది. సోమవారం నుంచి ఈ సినిమాకు ఓవర్ ఫ్లోస్ వస్తాయి’’ అని చెప్పాడు. ఇక ఈ చిత్రాన్ని సీడెడ్.. వైజాగ్ ఏరియాల్లో డిస్ట్రిబ్యూట్ చేసిన ‘లెజెండ్’ ప్రొడ్యూసర్.. బాలయ్య మిత్రుడు సాయి కొర్రపాటి స్పందిస్తూ.. ‘‘సీడెడ్ ఏరియా బాలయ్యకు కంచుకోట. ఆయనకు ఇక్కడున్న బలం దృష్ట్యా అందరూ ఫ్యాన్సీ రేట్లకు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ని తీసుకున్నారు. ఆదివారానికి సీడెడ్లో అందరూ బ్రేక్ ఈవెన్ కు వచ్చేస్తారు. ఆల్ టైం కలెక్షన్ల రికార్డుల్లో ఈ సినిమా టాప్-5లో ఉంటుంది’’ అని చెప్పాడు. తూర్పు గోదావరిలో సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన సురేష్ బాబు కూడా హర్షం వ్యక్తం చేశాడు. యుఎస్ లో ఈ సినిమా 2 మిలియన్ క్లబ్బులోకి అడుగుపెడుతుందని అక్కడి డిస్ట్రిబ్యూటర్ ధీమా వ్యక్తం చేయడం విశేషం.