వెండి తెరపై మరో బయోపిక్‌.. సాహితి ప్రియులకు గుడ్ న్యూస్‌

Update: 2022-04-11 01:30 GMT
ఈమద్య ఇండియన్‌ సిల్వన్ స్క్రీన్ పై బయోపిక్ ల హవా కొనసాగుతుంది. క్రీడా రంగం... సినిమా రంగం మరియు శాస్త్ర విజ్ఞాన రంగానికి చెందిన ఎంతో మంది ప్రముఖుల బయోపిక్ లను ఇప్పటి వరకు మనం చూశాం. ఈమద్య కాలంలో మరిన్ని బయోపిక్ లు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతోంది. తాజాగా మరో బయోపిక్ కు రంగం సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది.

తెలుగు సాహితి రంగంలో చలం ది చాలా ప్రత్యేకమైన స్థానం అనడంలో సందేహం లేదు. ఆయన రచనలు ఇప్పటికి కూడా అద్బుతమైన రెస్పాన్స్‌ ను దక్కించుకుంటూ ఉన్నాయి. ఆయన రచనలు కొన్ని లక్షల మందికి ఆదర్శంగా నిలుస్తాయి. అదే సమయంలో ఆయన రచనల పై విమర్శలు గుప్పించే వారు కూడా చాలా మంది ఉన్నారు.

అలాంటి చలం జీవితం ఆధారంగా సినిమా ను తెరకెక్కించేందుకు రంగం సిద్దం అయ్యింది. గుడిపాటి వెంకటా చలం అలియాస్ చలం జీవితంకు సంబంధించిన కొన్ని కీలక ఘటాలతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయన రచనలకు మరియు ఆయన నేపథ్యంకు గల కారణాలు ఏంటీ అనేది ఈ బయోపిక్‌ లో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

అన్నమయ్య మరియు శ్రీరామదాసు చిత్రాలకు కథను అందించిన భారవి ప్రస్తుతం చలం యొక్క బయోపిక్ కథ ను రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. చలం యొక్క పాత్రకు కీరవాణి అయితే బాగుంటుందని భారవి భావించాడట. కాని కీరవాణి ఆ ఆఫర్‌ ను తిరష్కరించినట్లుగా తెలుస్తోంది. చలం పాత్రకు ఎవరు అయితే బాగుంటుందా అంటూ భారవి అన్వేషణలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.

చలం కెరీర్ లో చాలా మలుపులు ఇంట్రెస్టింగ్‌ విషయాలు ఉంటాయని.. వాటిని డ్రమెటిక్ గా ఆసక్తికర సన్నివేశాలతో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. సాహితి ప్రియులకు ఇది ఖచ్చితంగా గుడ్‌ న్యూస్‌ అనడంలో సందేహం లేదు.
Tags:    

Similar News