సేఫ్ జోన్ లో మాజీ హీరోయిన్‌ భర్త

Update: 2016-03-23 04:47 GMT
గుల్ పనగ్.. మాజీ హీరోయిన్‌ కం పొలిటీషియన్. ఈమె భర్త రిషి అత్తారి బ్రసెల్స్ ఎయిర్ పోర్ట్ లో చిక్కుకుపోయాడు. ఇవాళ ఉదయం ఇక్కడ వరుస పేలుళ్లు సంభవించడంతో.. అన్ని రకాల సర్వీసులు నిలిచిపోయాయి. యూరోప్ పై దాడుల్లో భాగంగా తాజాగా జరిగిన పేలుళ్లలో 26 మంది మరణించారు.

గుల్ పనగ్ భర్త రిషి.. ఇండియా కేంద్రంగా సర్వీసులు నిర్వహించే ఓ ప్రైవేట్ ఎయిర్ లైన్స్ సంస్థకు చెందిన విమానంలో క్రూ మెంబర్. ఈ ఫ్లైట్ ఢిల్లీ నుంచి బ్రసెల్స్ వెళ్లగా.. అక్కడ  బ్లాక్ అయిపోయాడు. 'ఆయన క్రూ మెంబర్. నాకు అప్ డేట్స్ పంపిస్తున్నాడు, క్రూ - పాసింజర్స్ సేఫ్ గా ఉన్నారు' అని ఒకసారి.. 'ఫ్లైట్ నేలకు దిగింది. ప్రస్తుతం వారంతా సెక్యూర్డ్ ప్లేస్ లో ఉన్నారు' అని మరోసారి గుల్ పనగ్ ట్వీట్ చేసింది. 'డియర్ ఫ్రెండ్స్ దయచేసి నాకు కాల్ చేయకండి, ట్విట్టర్ హ్యాండిల్ ని చూడండి, నేను బ్రసెల్స్ లో లేను. నేను ఎలాంటి రియాక్షన్ చెప్పలేదు. దయచేసి నాకు కాల్ చేయద్దు. తను కాల్ చేసే కాల్స్ కోసం లైన్ ఖాళీగా ఉంచండి' అంటూ కోరింది గుల్ పనగ్

ఐదేళ్ల క్రితం రిషి అత్తారుతో మాజీ మిస్ ఇండియా గుల్ పనగ్ వివాహం జరిగింది. ప్రస్తుతం తన భర్త సేఫ్టీ తెలుసుకుంటూనే.. మరోవైపు.. తన ఫాలోయర్స్ కు కూడా అప్ డేట్ ఇస్తూ.. ధైర్యవంతురాలని అనిపించుకుంటోంది.
Tags:    

Similar News