కంగనా ఆరోపణలు నాకు అర్థం కావడం లేదు!

Update: 2019-02-14 16:38 GMT
బాలీవుడ్ క్వీన్ గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్ కు లుక్స్ విషయంలో..  నటన విషయంలో.. స్టార్డమ్ విషయం ఎన్ని ఎక్కువ మార్కులు పడతాయో.. వివాదాల విషయం వచ్చేసరికి అన్ని తక్కువ మార్కులు వస్తాయి.  ఎప్పుడో ఒక వివాదం  తలెత్తితే.. అవతల వారిది తప్పని.. కంగనా వెర్షన్ కరెక్ట్  అని సరిపెట్టుకోవచ్చు.  కానీ ప్రతిదీ రచ్చే.. ప్రతి సినిమాతోనూ వివాదమే అవుతోందంటే ఇది ఖచ్చితంగా కంగనావైపు వేలెత్తి చూపించే అంశమే.  నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుందని తెలుగులో ఒక సామెత ఉంది. పాపం ఈ సామెత హిందీలో లేదేమో గానీ కంగనాకు తెలిసినట్టుగా లేదు.  అయినా కంగనాదే కరెక్ట్ అని ఆమె ప్రతి వాదనకు మద్దతిచ్చేదివారు కూడా చా....లామంది ఉన్నారు.  

రీసెంట్ గా 'మణికర్ణిక' తో మరోసారి కంగనా తను ఎంత గొప్ప నటో మరోసారి ప్రూవ్ చేసింది. సినిమా బిజినెస్ తన పేరుమీదే జరిగింది..కంగనాను చూసే జనాలు థియేటర్ కు వచ్చారని అనడంలో కూడా ఏమాత్రం అతిశయోక్తి లేదు.  కానీ సినిమా గురించి ఒక ఇంటర్వ్యూలో  మాట్లాడుతూ బాలీవుడ్ తనను ఏకాకిని చేసిందని.. తన సినిమాలను ఎవరూ గుర్తించడం లేదని.. అసలు కంగనా లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేసింది.  త్వరలో బాలీవుడ్ జనాల అసలు రంగును బైట పెడతానని కూడా హెచ్చరించింది.

అయినా ఇలా హెచ్చరించాక కూడా ఎవరైనా బుద్ధి ఉన్నోడు కంగనా గురించి అసలు పాజిటివ్ గా అయినా నెగెటివ్ గా అయినా కామెంట్ చేస్తాడా?? దీని సంగతేమో గానీ రీసెంట్ గా ఒక బాలీవుడ్ వెబ్ సైట్ వారు 'గల్లీ బాయ్' డైరెక్టర్ జోయా అఖ్తర్ ను కంగనా ఆరోపణల గురించి అడిగారు. దానికి సమాధానంగా ఆవిడ "ఆఫ్ కోర్స్.. జనాలు ఆమె వర్క్ ను ప్రశంసిస్తారు. అసలు ఆమె ఆరోపణలు నాకు అర్థం కావడం లేదు. అయామ్ సారీ" అంటూ స్పందించింది.  అంతకంటే ఎక్కువ మాట్లాడలేదు. మాట్లాడితే కంగనా సోదరి రంగోలి చందేల్ రంగంలోకి ట్విట్టర్ యుద్ధం ప్రకటిస్తుందేమోనని భయపడిందేమో..!
Tags:    

Similar News