కొత్తగా ఈ టైటిలేంది గుణశేఖరూ..

Update: 2015-11-30 15:30 GMT
మొత్తానికి అన్ని అడ్డంకుల్నీ అధిగమించి..‘రుద్రమదేవి’ సాహస యాత్రను పూర్తి చేశాడు గుణశేఖర్. పెట్టుబడితో పోల్చి చూస్తే ‘రుద్రమదేవి’ గుణశేఖర్ కు నష్టాలే మిగిల్చి ఉండొచ్చేమో కానీ.. తెలుగు సినిమా మార్కెట్ లెక్కల ప్రకారం చూస్తే మాత్రం ‘రుద్రమదేవి’ బ్లాక్ బస్టర్ హిట్టే అని చెప్పాలి.

గుణశేఖర్ మళ్లీ ఓ సినిమా చేయడానికి కావాల్సిన ఉత్సాహమైతే ‘రుద్రమదేవి’ ఇచ్చింది. ఇంతకీ గుణ తర్వాత ఏ సినిమా చేయబోతున్నాడన్నది ఆసక్తికరం. అతడి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో రకరాల ఊహాగానాలు ఉన్నాయి కానీ.. అతను మాత్రం నోరు విప్పి ఫలానా సినిమా చేయబోతున్నా అని మాత్రం చెప్పట్లేదు.

రుద్రమదేవి చివర్లో ఇచ్చిన హింట్ ప్రకారమైతే గుణ తర్వాత ‘ప్రతాప రుద్రుడు’ చేయాలి. కానీ ఇప్పుడా సంకేతాలు కనిపించట్లేదు. తాజాగా గుణ.. ఫిలిం ఛాంబర్లో ‘గోన గన్నారెడ్డి’ అనే టైటిల్  రిజిస్టర్ చేయించాడు. అంటే గోన గన్నారెడ్డి మీద పూర్తి స్థాయి సినిమా చేస్తాడా అన్నది ఆసక్తికరం.

‘రుద్రమదేవి’ సినిమా రుద్రమదేవి జీవిత కథతో తెరకెక్కినా.. అందులో హైలైట్ అయ్యింది గోన గన్నారెడ్డి పాత్రే. ఆ క్యారెక్టర్ ద్వారా ఎంత జ్యూస్ రాబట్టాలో అంతా రాబట్టేశాడు గుణ. ఇక దాంతో కొత్తగా చేసేదేం లేదు. చేసినా జనాలు చూసే పరిస్థితి ఉండదు. ఐతే అట్రాక్టివ్ టైటిల్ కాబట్టి.. ఆ పేరు పెట్టి వేరే సినిమా ఏదైనా సినిమా తీస్తాడేమో చూడాలి.
Tags:    

Similar News