'రుద్ర‌మ‌దేవి'కి 'బాహుబ‌లి'తో ముప్పు లేదు!

Update: 2015-07-25 07:15 GMT
మూడేళ్లు గా టాలీవుడ్‌ లో త‌ర‌చుగా వినిపిస్తున్న సినిమాల పేర్లు... బాహుబ‌లి, రుద్ర‌మ‌దేవి. విజువ‌ల్ ఎఫెక్ట్స్‌ కి ప్రాధాన్య‌మున్న ఈ రెండు చిత్రాలు ఇంచుమించు ఒకేసారి సెట్స్‌ పైకి వెళ్లాయి. రెండు సినిమాల‌ కి కూడా బోలెడ‌న్ని సిమిలారిటీస్ ఉన్నాయి. అనుష్క‌, రానా, క‌త్తియుద్ధాలు, గుర్ర‌పుస్వారీలు... ఇవ‌న్నీ రెండు సినిమాల్లో ని  కామ‌న్ థింగ్స్‌.  అందుకే  ఏ సినిమా ముందు విడుద‌లైతే ఆ సినిమాకే ప్ల‌స్ జ‌రుగుతుంద‌ని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు చెప్పుకొచ్చాయి. 'బాహుబ‌లి' విడుద‌ల‌య్యాక 'రుద్ర‌మ‌దేవి'కి త‌ప్ప‌క ఎఫెక్ట్ ప‌డుతుంద‌ని మాట్లాడుకొన్నారు. 'బాహుబ‌లి'  విజువ‌ల్స్ చూశాక... ఇదే  స్థాయిలో 'రుద్ర‌మదేవి' లేక‌పోతే ప్రేక్ష‌కులకు రుచించ‌దని చెప్పుకొన్నారు. కానీ బాగా ప‌రిశీలించి చూస్తే 'బాహుబ‌లి' నుంచి 'రుద్ర‌మ‌దేవి'కి పెద్ద‌గా ముప్పేమీ ఉండ‌ద‌ని అర్థ‌మ‌వుతుంది.

'రుద్ర‌మ‌దేవి' ఒక చారిత్రాత్మ‌క క‌థ‌. అంద‌రికీ తెలిసిన క‌థ కావ‌డంతో ఆ క‌థ‌ని ఎలా చూపించారో అన్న ఆస‌క్తి ప్రేక్ష‌కుల్లో వ్య‌క్త‌మ‌వ్వ‌డం ఖాయం. ఆ ఆస‌క్తితోనే ప్రేక్ష‌కులు థియేట‌ర్‌కి వెళ్లొచ్చు. అలాగే రుద్ర‌మ‌దేవి లో కీల‌క పాత్ర పోషించిన అనుష్క 'బాహుబ‌లి'లో డీ గ్లామ‌ర్‌గానే  క‌నిపించింది. ఆమె చేసిన క‌త్తియుద్ధాలు, గుర్ర‌పుస్వారీలు సెకండ్ పార్ట్‌ లో ఉండ‌టం 'రుద్ర‌మ‌దేవి'కి క‌లిసొచ్చే అంశం. ఇక విజువ‌ల్స్ అంటారా?  ట్ర‌యిల‌ర్ చూస్తే  'బాహుబ‌లి'కి ఏమాత్రం త‌గ్గ‌ని రీతిలో విజువ‌ల్స్ క్రియేట్ చేశార‌ని అర్థ‌మ‌వుతోంది. 'రుద్ర‌మ‌దేవి'ని త్రీడీలోనూ తీశారు. దాదాపు 90థియేట‌ర్ల‌లో త్రీడీ వెర్ష‌న్ సినిమాని ప్ర‌ద‌ర్శించ‌బోతున్నారు. త్రీడీ లో విజువ‌ల్స్ క‌చ్చితంగా ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతినిస్తాయ‌న‌డంలో సందేహం లేదు. ఇలా త‌న సినిమాకి బోలెడ‌న్ని ప్ల‌స్ పాయింట్లు ఉన్నాయి కాబ‌ట్టి గుణ‌శేఖ‌ర్ చాలా కాన్ఫిడెంట్‌ గా ఉన్నాడు. 'బాహుబ‌లి'కి విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, సెట్లు  ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయ‌నీ, క‌థేమీ పెద్ద‌గా లేద‌నే టాక్ వ‌చ్చింది. ఆ టాక్‌ని ఆస‌రాగా చేసుకొనే గుణ‌శేఖ‌ర్ త‌న సినిమాకి ప్ర‌చారం చేసుకొంటున్న‌ట్టు తెలుస్తోంది. నిన్న జ‌రిగిన ప్రెస్‌మీట్లో గుణ మాట్లాడుతూ  సెట్లకోస‌మో, గ్రాఫిక్స్‌కోస‌మో సినిమా తీయ‌లేద‌నీ, క‌థని న‌మ్మి చేశాన‌ని చెప్పుకొచ్చాడు. విడుద‌ల తేదీ సెప్టెంబ‌రు 4న ఫిక్స్ కావ‌డంతో ఆ లోపు సినిమాని బ‌లంగా ప్ర‌మోట్ చేసుకోవాల‌ని గుణ‌శేఖ‌ర్ ఫిక్స‌య్యారు.
Tags:    

Similar News