అసలు ప్రాబ్లెం ఏంటి గుణా?

Update: 2015-08-24 18:27 GMT
గుణశేఖర్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ రుద్రమదేవి పైనే కళ్లన్నీ. దేశంలోనే తొలి హిస్టారికల్‌ 3డి సినిమా తీస్తున్నా, ఇదే నా జీవితం అంటూ ప్రకటించాడు గుణ. అతడి కలలు సాకారమయ్యే రోజు ఇంకెంతో దూరంలో లేదు. రిలీజ్‌ కి టైమ్‌ వచ్చేసిందని ముచ్చట్లు సాగాయి. అయితే భారీ కాన్వాసుతో తెరకెక్కించిన ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ అంతకంతకూ అంతూ దరీ లేకుండా సాగుతూనే ఉంది. ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించిన విజువల్‌ గ్రాఫిక్స్‌ పనులు పూర్తి కాలేదనే చెబుతున్నారు. ఇప్పటికే సెప్టెంబర్‌ 4 రిలీజ్‌ అంటూ తేదీ ప్రకటించేశారు.

కానీ అప్పటికైనా సినిమా రిలీజవుతుందా? అనేది సందేహమేనని ఫిలింనగర్‌ లో అనుకుంటున్నారు. మూడోవారానికి వాయిదా పడే ఛాన్సుందనీ అంటున్నారు. ఇప్పటికే రెండు, మూడు సార్లు రిలీజ్‌ తేదీల్ని వాయిదా వేయాల్సొచ్చింది. అసలేం జరుగుతోంది? అన్న సందిగ్ధాలెన్నో. దీనికి నీ సమాధానం ఏంటి గుణా?

అసలేంటి పరిస్థితి? గ్రాఫిక్స్‌ ఇంకా పూర్తి కాలేదా? బిజినెస్‌ పూర్తవ్వలేదా? సేల్‌ అవ్వలేదా? లాభాలు రాలేదా? ఏంటి మీ వివరణ? .. అభిమానులంతా ఎంతో ఎగ్జయిట్‌ గా ఉన్నారు. బాహుబలిని కొట్టే ఇంకో సినిమా రావాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు? అసలు సమాధానం ఏంటి? ఈ భగీరథ ప్రయత్నం ఎప్పటికి ఫలిస్తుంది?
Tags:    

Similar News