గుణశేఖర్ సార్.. అసలు ఏం జరుగుతోంది? మాకు తెలియాలి.. తెలిసి తీరాల్సిందే.. ఇలాంటి మాటలు మనం చెప్పుకునేలోపే గుణ సార్ క్లారిటీ ఇచ్చేశారు. నిజానికి ''బాహుబలి'' సినిమాను చూసే లోపే మనం ''రుద్రమదేవి'' సినిమాను వెండితెరపై చూసేస్తాం అని సంబర పడిపోయాం. ఇంకేముంది వచ్చేస్తోంది పిచ్చెక్కిద్దా అంటూ హ్యాపీ ఫీలయ్యాం. ఇంతలో చేదు వార్త. క్వాలిటీ గ్రాఫిక్స్ కారణంగా రాలేకపోతున్నాం అంటూ బాంబ్ పేల్చారు
జూన్ 26 రావల్సిన ''రుద్రమదేవి'' వచ్చిన హైప్ అంతా ఈజీగా పోగొట్టేసుకుంటోంది. ముందుగా అల్లు అర్జున్ గోన గన్నారెడ్డిగా రోల్ చేశాడనగానే కొత్తఊపు వచ్చింది. మనోడు ఆడియో లాంచ్‌లో కాస్త ఆవేశంగా మెగాస్టారే జీవితం అని మాట్లాడి సినిమావైపు అందరి దృష్టీ మరల్చాడు. కాని అవేం రుద్రమదేవి క్యాష్ చేసుకోలేకపోయిందంతే. కట్ చేస్తే.. మెగాస్టార్ వాయిస్ ఓవర్ అనగానే సినిమాకు ఇంకా క్రేజ్ పెరిగింది. ఆయన వాయిస్ వినడం కోసం సినిమా చూడాలి అనుకునేవారు చాలామందే ఉన్నారు. కాని చివరకు జూన్ 26న రావట్లేదని చెప్పేశారు. అంతా తుస్‌స్. ఇంతలో మళ్ళీ ఇంకో వార్త.. ''ప్రపంచ నలుమూలలున్న స్టూడియోలన్నీ విజువల్ ఎఫెక్ట్స్ పనులను పూర్తి చేయడానికి బాగా కష్టపడుతున్నాయి. త్వరలోనే సినిమా తెచ్చేస్తాం'' అంటూ చెప్పాడు గుణ. ఏంటి సార్.. పనులు ఇంకా అవుతూనే ఉన్నాయా? ఎప్పుడు సార్ మేమీ సినిమా చూసేది?