శాకుంతలం క్రెడిట్ మొత్తం ఆయనదే..!

Update: 2023-01-09 13:33 GMT
సమంత లీడ్ రోల్ లో గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా శాకుంతలం. నీలిమ గుణ నిర్మించిన ఈ సినిమాను దిల్ రాజు సమర్పిస్తున్నారు. సినిమాలో మళయాళ నటుడు దేవ్ మోహన్ కూడా నటించారు. కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం కథతోనే ఈ సినిమా తెరకెక్కించామని అన్నారు గుణశేఖర్. ఇక ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో గుణశేఖర్ చాలా ఎమోషనల్ అయ్యారు. శాకుంతలం సినిమాకు ముగ్గురు హీరోలని ఆయన చెప్పారు. సినిమాలో కథకు హీరోగా దేవ్ మోహన్ అయితే.. సినిమాలో హీరో సమంత అని అన్నారు.

ఇక తెరవెనుక ఉండి అంతా నడిపించిన దిల్ రాజు మరో హీరో అని అన్నారు. తనలాంటి మేకర్స్ కు దిల్ రాజు లాంటి వారు దొరకడం అదృష్టమని సినిమాకు ఎలాంటి కాలిక్యులేషన్స్ లేకుండా ఆయన ఇచ్చిన సపోర్ట్ చాలా గొప్పదని అన్నారు గుణశేఖర్.

తన కూతురు నీలిమ ఇండియాకు వచ్చిన వెంటనే నిర్మాత అవుతానని చెప్పింది.. తనేదో కథ చెబితే అది కాదు పురాణ కథ కావాలని అడిగింది. అందుకే శాకుంతలం సినిమా చెప్పానని.. ఇక ఈ సినిమా కథ చెప్పగానే సమంత అయితేనే శకుంతల పాత్రకు పర్ఫెక్ట్ అని నీలిమ అన్నదని చెప్పారు గుణశేఖర్.

సమంత గురించి మాట్లాడుతూ సమంత ఈ సినిమాకు చాలా కష్టపడ్డదని.. శాకుంతలంగా సమంత పూర్తి స్థాయిలో న్యాయం చేసిందని అన్నారు. ఈ సినిమా బాగా వచ్చిందని.. మంచి కథలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు కాబట్టి ఈ సినిమాను కూడా వారు తప్పకుండా ఆదరిస్తారని అన్నారు గుణశేఖర్. ఎప్పుడో పాతికేళ్ల క్రితం రామాయణం తీశావు కదా మళ్లీ అలాంటి సినిమా తీయాలని తను కోరింది. అందుకే మైథాలజీ కథ ఎంచుకున్నా.. ఇక తను ఒక్కటే మాట అన్నది మైథాలజీ ఫర్ మిలినీయర్స్.

ఇప్పటి మిలినీయర్స్ కు మన మైథాలజీ కథలు చెప్పాలని అన్నది. ఒకప్పుడు ఎన్.టి.ఆర్, ఏయన్నార్ ల సినిమాలు ఇప్పుడు మనం ఎలా చూస్తున్నామో ఈ శాకుంతలం కథ ముందు తారాలు చూసే అవకాశం ఉందని అన్నారు గుణశేఖర్. మైక్ పట్టుకుని మాట్లాడుతూనే ఎమోషనల్ అయ్యారు గుణశేఖర్. ఈ సినిమాను ఎంత ప్రేమించి తీశారో ఆయన ఎమోషన్ లో అర్ధం చేసుకోవచ్చు. గుణశేఖర్ ఎమోషనల్ అవగా ఆయన్ను చూసి సమంత కూడా కళ్లె వెంట నీళ్లు తెచ్చుకుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News