‘గురు’వు గారికి అక్కడ పంచ్ పడిందే..

Update: 2017-04-04 05:56 GMT
విక్టరీ వెంకటేష్ కొత్త సినిమా ‘గురు’ పాజిటివ్ టాక్ తో మొదలై.. తొలి వారాంతంలో తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లే సాధించింది. ఐతే ఓవరాల్ షేర్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. ఫస్ట్ వీకెండ్లో ఈజీగా పది కోట్ల షేర్ దాటేస్తుందని అంతా అంచనా వేశారు కానీ.. షేర్ రూ.7 కోట్ల మార్కును మాత్రమే దాటింది. పొరుగు రాష్ట్రాల్లో కానీ... అమెరికాలో కానీ వసూళ్లు ఆశాజనకంగా లేకపోవడమే దీనికి కారణం. తమిళనాడు.. కర్ణాటకలో నంబర్స్ నామమాత్రంగా ఉండటంతో వాటిని కన్సిడరేషన్లోకే తీసుకోలేని పరిస్థితి. అమెరికాలో కూడా వసూళ్లు ఏమంత ఆశాజనకంగా లేవు. నిజానికి ఈ సినిమాకు అమెరికన్ తెలుగు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ఉంటుందని ఆశించారు.

‘గురు’ క్లాస్ టచ్ ఉన్న సినిమా. ఎన్నారై ప్రేక్షకుల టేస్టుకు తగ్గట్లుగా ఉంటుంది. పైగా టికెట్ రేట్లు కూడా తక్కువే పెట్టారు. ప్రిమియర్ల నుంచే 12 డాలర్లతో ప్రేక్షకుల్ని ఆకర్షించే ప్రయత్నం చేశారు. ‘కాటమరాయుడు’ కథ కంచికి చేరిన నేపథ్యంలో అమెరికా ప్రేక్షకుల దృష్టి కచ్చితంగా ‘గురు’ వైపు మళ్లుతుందని భావించారు. కానీ ఫస్ట్ వీకెండ్లో ఈ చిత్రం 1.4 లక్షల డాలర్లు మాత్రమే వసూలు చేసింది. వెంకీ స్టార్ ఇమేజ్ ప్రకారం.. సినిమాకు వచ్చిన టాక్‌ను బట్టి చూస్తే ఇది ఏమాత్రం ఆశాజనకమైన ఫిగర్ కాదు. ఫస్ట్ వీకెండ్లో ‘గురు’ కనీసం క్వార్టర్ మిలియన్ అయినా దాటుతుందని ఆశించారు. దగ్గుబాటి రానా సినిమా ‘ఘాజీ’ ఫస్ట్ వీకెండ్లో 4 లక్షల డాలర్ల దాకా వసూలు చేయడం విశేషం. మరి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న వెంకీ మూవీకి ఈ పరిస్థితి ఎందుకొచ్చిందో అర్థం కాలేదు. ఫస్ట్ వీకెండే ఇలా ఉంటే మున్ముందు ఏమాత్రం వసూళ్లు వస్తాయో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News