స్టార్ హీరోల సినిమాలు మొదలవకముందే రూమర్లు మొదలైపోతాయి. రామ్ చరణ్ కొత్త సినిమా విషయంలో రూమర్లకు కొదవే లేదు. ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ ఇప్పటికి చాలా పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అందులో ‘బ్రూస్ లీ’ ఒకటి. సినిమాలో చరణ్ స్టంట్ మాస్టర్ గా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ టైటిల్ బాగుంటుందని వైట్ల భావిస్తున్నట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి. ఐతే బ్రూస్ లీ అనే టైటిల్ పెడితే ఏదో డబ్బింగ్ సినిమా టైపులో ధ్వనిస్తుందన్న అనుమానాలతో ఆ టైటిల్ ను పక్కనబెట్టేసినట్లు సమాచారం. ప్రస్తుతానికి చరణ్ సినిమాకు ‘ఫైటర్’ అనే టైటిల్ పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఐతే చరణ్ వదిలేసిన టైటిల్ తో త్వరలోనే ఇంకో సినిమా రాబోతోంది. ఐతే అది తెలుగులో కాదు.. తమిళంలో. మ్యూజిక్ డైరెక్టర్ జి.వి.ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు ఈ టైటిల్ పెట్టారు. ఐతే ముందు ఈ సినిమాకు ‘బాషా ఎంగిర ఆంటోనీ’ అని పేరు పెట్టారు. ఐతే మళ్లీ ఏమైందో కానీ.. టైటిల్ ను ‘బ్రూస్ లీ’గా మార్చేశారు. ఐతే బ్రూస్ లీ అనేది ఎటకారంగా పెట్టిన టైటిల్. ఇదో కామెడీ సినిమా. ప్రశాంత్ పాండియరాజ్ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ జనాల్ని బాగానే ఆకట్టుకుంటోంది. ప్రేమకథా చిత్రమ్ రీమేక్ ‘డార్లింగ్’తో హీరో అవతారమెత్తిన జి.వి. ఆ సినిమా సూపర్ హిట్టవడంతో నటుడిగా ఫుల్ బిజీ అయిపోయాడు. ఆనందితో కలిసి అతను నటిస్తున్న ‘త్రిష ఇల్లాన నయనతార’ తెలుగులోకి కూడా అనువాదమవుతుండటం విశేషం.