నీక్కూడా నయనతార కావాలా నాయనా?

Update: 2015-08-29 07:14 GMT
మ్యూజిక్ డైరెక్టర్ గా జి.వి.ప్రకాష్ కుమార్ కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లు వర్ధిల్లుతుండగా సడెన్ గా నటన మీద దృష్టిపెట్టాడు కుర్రాడు. తొలి సినిమా ఫలితం తేడా వచ్చి ఉంటే యాక్టింగ్ నుంచి పక్కకు తప్పుకునేవాడేమో కానీ.. ప్రేమకథా చిత్రమ్ రీమేక్ గా వచ్చిన ‘డార్లింగ్’ సూపర్ హిట్టయిపోయి జీవీని నటుడిగా ఫుల్ బిజీ చేసేసింది. ఓవైపు ‘పెన్సిల్’ అనే  సినిమాలో.. మరోవైపు ‘త్రిష ఇల్లాన నయనతార’ సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు రెహమాన్ మేనల్లుడు. అంతటితో ఆగకుండా ఈ మధ్యే ‘బ్రూస్ లీ’ అనే సినిమాను అనౌన్స్ చేశాడు. దీని ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా జనాల్ని బాగా ఆకట్టుకుంది.

ఇంకా ఈ సినిమాకు హీరోయిన్ ను ఎంచుకోలేదు. ఐతే నయనతార కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఐతే  జి.వి.ప్రకాష్ పక్కన నయనతార సూటవుతుందా అన్న సందేహాలున్నాయి. ఇంతకుముందు ధనుష్ పక్కన నయనతార కనిపించినపుడు జోడీ కుదర్లేదన్న అభిప్రాయాలు వినిపించాయి. ‘ఆడువారి మాటలకు అర్థాలే వేరులే’ రీమేక్ ‘యారుడీ నీ మోహిని’లో ధనుష్ కు నయన్ అక్కలాగా కనిపించిందన్నారు.  జి.వి. కూడా ధనుష్ లాగే ఉంటాడు. చెప్పాలంటే ఇంకా కొంచెం బక్కగా, పొట్టిగానే ఉంటాడు. అలాంటోడి పక్కన నయన్ కనిపిస్తే చాలా ఆడ్ గా ఉంటుందని కోలీవుడ్ జనాలు అభ్యంతరాలు చెబుతున్నప్పటికీ.. జీవీ మాత్రం తగ్గట్లేదట. ఇంతకీ జి.వి. పక్కన నటించే విషయంలో నయన్ ఏమంటుందో చూడాలి.
Tags:    

Similar News