వరసగా భారీ ప్రాజెక్టులను లైన్లో పెట్టిన హారిక హాసిని

Update: 2020-02-03 01:30 GMT
టాలీవుడ్ లో విజయవంతమైన బ్యానర్లలో హారిక హాసిని క్రియేషన్స్ ఒకటి.  టాప్ హీరోలతో పలు విజయవంతమైన సినిమాలు నిర్మించిన హారిక హాసిని రాధా కృష్ణ గారికి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అనుబంధం ఎక్కువ. నిజానికి త్రివిక్రమ్ బయట నిర్మాతలకు సినిమాలు చేయడం ఎప్పుడో మానేశారు. త్రివిక్రమ్ ప్రతి సినిమాకు హారిక హాసిని వారే నిర్మాతలు. ఈమధ్య సంక్రాంతికి రిలీజైన బ్లాక్ బస్టర్ 'అల వైకుంఠపురములో' సినిమాను కూడా హారిక హాసిని వారే నిర్మించారు.

'అల వైకుంఠపురములో' ఇచ్చిన జోష్ లో వరసగా స్టార్ హీరోలతో సినిమాలను లైన్లో పెట్టారని సమాచారం.  హారిక హాసిని వారి లైనప్ చూస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే.  ఈ సినిమాలన్నిటికీ త్రివిక్రమ్ దర్శకుడు.  'అల వైకుంఠపురములో' తర్వాత త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ ఈ సినిమా కథపై పని చేస్తున్నారు.  'RRR' షూటింగ్ పూర్తి కాగానే యంగ్ టైగర్ ఈ సినిమాకు డేట్స్ ఇస్తారట.  

ఇక ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉంటుంది.  త్రివిక్రమ్-పవన్ కాంబినేషన్ చివరిసారి 'అజ్ఞాతవాసి' తో మిస్ ఫైర్ అయింది కానీ ఈసారి మాత్రం అలా జరగకుండా పవన్ కు సూపర్ హిట్ ఇవ్వాలని పవన్ ఫ్రెండ్ కంకణం కట్టుకున్నారట.  ఈ సినిమా తర్వాత  మెగా పవర్ స్టార్ చరణ్ తో ఒక సినిమా ఉంటుంది.. తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో ప్లాన్ చేస్తున్నారట. ఈ ప్రాజెక్టులు పూర్తైన తర్వాత మరోసారి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా ఉంటుందట.  అంటే ఓ మూడు సంవత్సరాల పాటు హారిక హాసిని - త్రివిక్రమ్ ప్రాజెక్టులు లాక్ అయినట్టే.  


Tags:    

Similar News