ఫోటో స్టోరి: నిలువవే వాలు కనులదానా వయ్యారి హంస నడకదానా

Update: 2021-03-31 15:30 GMT
నిలువవే వాలు కనులదానా ..వయ్యారి హంస నడకదానా.. నీ నడకలో హోయలున్నదె జాణ..నువ్వు కులుకుతు ఘ‌ల‌ఘ‌ల‌ నడుస్తు వుంటే
నిలువదె నా మనసు..ఓ లలనా..అది నీకే తెలుసు...! ఏఎన్నార్ - జెమున న‌టించిన ఇల్ల‌రికం చిత్రంలోనిది ఈ పాట‌. ఘంట‌శాల- కొస‌రాజు బృందం నుంచి పుట్టుకొచ్చిన క్లాసిక్ సాంగ్ ఇది. ఆరోజుల్లోనే ది గ్రేట్ లిరిసిస్ట్ కొస‌రాజు అంత అంద‌మైన ప‌దాల అల్లిక‌తో మ్యాజిక్ చేశారు.

ఆ లిరిక్ ఇప్పుడే ఎందుకు? అంటే.. ఇక్క‌డ కూడా ఒక హంస ఇంచుమించు అలానే వ‌య్యారాలు వ‌డ్డిస్తోంది. కొస‌రాజు ఆత్మ ఆరోజు జెమున న‌డ‌క‌ల్ని ఊహించుకుంటే.. ఇప్పుడు టీనేజీ బోయ్స్ హంస న‌డ‌క‌ల్ని ఊహించుకుంటున్నారు. గ‌త కొంత‌కాలంగా హంసానందిని సోష‌ల్ మీడియా న‌డ‌క‌లు అంతే వ‌య్యారంగా వైర‌ల్ అవుతున్నాయి.

అప్పుడ‌ప్పుడు కేర‌ళ అడ‌వుల‌కు జ‌ల‌పాతాల‌కు కావాల్సినంత ప్ర‌మోష‌న్ చేసి పెడుతున్న హంసానందిని కొన్నిసార్లు వంట‌కాలు వండి తింటూ కూడా బోలెడంత వినోదం పంచుతున్నారు. తాజాగా మ‌రో వంట‌ల కార్య‌క్ర‌మానికి ఇంత స్టైలిష్ గా బ‌రిలో దిగారు. చూస్తుంటే మ‌హిళా కలెక్ట‌ర్ గారు అప్పుడే వండిన వంట‌కాలు తినేందుకు దిగిన‌ట్టుగా ఉంది..!! అంటూ బోయ్స్ ఒక‌టే కామెంట్లు గుప్పిస్తున్నారు. ఏదేమైనా హంసా స్ట‌న్నింగ్ లుక్ ప్ర‌స్తుతానికి యూత్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇంత‌కీ హంస వండేందుకు వ‌చ్చిన‌ట్టా.. వండిన‌వి తినేందుకా?
Tags:    

Similar News