స‌రోవ‌రం నుంచి దారి త‌ప్పి బికినీ బీచ్ లో వాలింది!

Update: 2021-06-07 23:30 GMT
హంస‌లు జ‌ల‌కాలాడే స్వ‌ర్గ స్థ‌లం `మాన‌స స‌రోవ‌రం`. కానీ ఈ హంస మాత్రం స‌రోవ‌రం నుంచి దారి త‌ప్పి బికినీ బీచ్ లో వాలింది! .. చూస్తుంటే ఇక్క‌డ స‌న్నివేశం అలానే ఉంది. ఏకాంత దీవిలో బీచ్ ఇసుక‌లో హంసానందిని త‌న‌కు న‌చ్చిన‌ట్టు ఎంజాయ్ చేస్తోంది.

ఇటీవ‌ల వ‌రుస‌గా ర‌క‌ర‌కాల ప‌ర్య‌ట‌న‌ల‌కు సంబంధించిన ఫోటోషూట్ల‌ను షేర్ చేసిన హంసా నందిని అప్పుడ‌ప్పుడు వంట‌లు చేస్తూ ఆ వీడియోల్ని త‌న అభిమానుల‌కు షేర్ చేశారు.

మొన్న‌ అంత‌ర్జాతీయ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా హంసా నందిని ప‌చ్చ‌ని వాతావ‌ర‌ణంలో ఫోటోషూట్ ని షేర్ చేశారు. అది అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యింది. తాజాగా దానికి కాంట్రాస్ట్ గా బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్ ఫోటోని షేర్ చేసింది. ఆరంజ్ టాప్ లో హంస వెట్ సెల్ఫీ ఒక్కసారిగా హీట్ పెంచింది. అన్న‌ట్టు ఈ లాక్ డౌన్ అయ్యాక అయినా తిరిగి టాలీవుడ్ లో అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నిస్తుందా లేక ఈ ట్రావెల్ టూరిజాన్ని కొన‌సాగిస్తుందా? అన్న‌ది అర్థం కావ‌డం లేదు. హంస క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.
Tags:    

Similar News