హార్వే వీన్ స్టీన్.. కెవిన్ స్పేసీ.. లాంటి మహామహులే శంకరమాన్యాలు పట్టారు. లైంగిక వేధింపుల్లో ఇదో కొత్త శకం. ఇక్కడ శిక్ష గ్యారెంటీ. బాల్ గేమ్ పూర్తిగా అవతలి వైపే నడుస్తోంది. కథానాయికలు బహిరంగంగా ఆరోపించాలే కానీ, మీ టూ హ్యాష్ ట్యాగ్ పురుషపుంగవుల భరతం పట్టేందుకు సిద్ధంగా ఉంటోంది. ఆ క్రమంలోనే బిలియన్ డాలర్ బిజినెస్ చేసే సంస్థల అధిపతులకే జైలు గోడలు చూపిస్తున్నారు. గొప్ప స్టార్ డమ్ ఉండీ - ఆస్కార్ లు అందుకున్న వాళ్లకే కుంభాలు కదిలిపోతున్నాయ్.
అలాంటిది లోకల్ డైరెక్టర్లు - హీరోలు ఈ ఉద్యమం ముందు ఎంత? ప్రస్తుతం మీటూ సిరీస్ లో మరో వికెట్ నేలకూలింది. ఇదేమీ మామూలు ఆషామాషీ వికెట్ ఏమీ కాదు. వందల కోట్ల బిజినెస్ స్టేక్స్ ని శాసించే గ్రేట్ డైరెక్టర్ వికాస్ బాల్ వికెట్. ఈ దెబ్బ కొట్టింది ఎవరో తెలుసు కదా! ది గ్రేట్ క్వీన్ కంగన రనౌత్. మీటూ అండతో కంగన అతడిపై తీవ్ర ఆరోపణలు చేసింది. విష్ పేరుతో హగ్గిచ్చి - తలవెంట్రుకలు వాసన చూసేవాడని ఆరోపించింది. వేధింపులకు పాల్పడ్డాడని పరోక్షంగా వెల్లడించింది. దీంతో ఇప్పుడు అతడికి తిప్పలు మొదలయ్యాయి. ఈ ఆరోపణల వల్ల ముందుగా హృతిక్ రోషన్ కథానాయకుడిగా నటిస్తున్న `సూపర్ 30` చిత్రం చిక్కుల్లో పడకుండా ప్రయత్నాలు మొదలయ్యాయి.
హార్వే వీన్ స్టీన్ (ఎగ్జిక్యూటివ్ నిర్మాత) - కెవిన్ (టీవీ సిరీస్ నటుడు) అంతటి వాళ్లనే ప్రాజెక్టు మధ్యలో వదిలించుకున్నారు. ఈయనెంత? ఈయన మాకో లెక్క? అన్నతీరుగా రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ - పాంథమ్ ఫిలింస్(విక్రమాధిత్య-మధుమంతెన నిర్మాతలు) - సాజిద్ నడియావాలా టీమ్ (నిర్మాతలు) దర్శకుడు వికాస్ బాల్ ని ప్రాజెక్టు నుంచి తప్పించిందని తెలుస్తోంది. అతడి పేరు ఉండడం వల్ల సినిమాకి బిజినెస్ పరంగా సమస్యలొస్తాయని భావించి ఈ పని చేస్తున్నారట. అంటే దర్శకుడిగా టైటిల్ క్రిడెట్స్ లో అసలు వికాస్ పేరు కనిపించదనేది దీని సారాంశం. మొత్తానికి తనూశ్రీ లైంగిక వేధింపుల రోలో ఇదో ఆరంభం మాత్రమేనని భావించాల్సి ఉంటుంది. తనూశ్రీకి పలువురు కథానాయికల నుంచి బలమైన సపోర్టు దక్కడంతో గేమ్ అన్నివేళలా తనవైపే ఉందని అర్థమవుతోంది.