హీరోయిన్ గా హన్సిక తెలుగులో దాదాపుగా ఫేడ్ అవుట్ అయింది గానీ తమిళంలో మాత్రం వరసగా సినిమాలు చేస్తూ ఉంది. ఈమధ్యే కెరెర్లో మైలురాయి లాంటి 50 చిత్రాల మార్కును చేరుకుంది. త్వరలో రిలీజ్ కానున్న తన 50వ చిత్రం 'మహా' పోస్టర్ ను ఈమధ్యే ఫిలిం మేకర్స్ విడుదల చేశారు. కాశీ పట్టణ ఘాట్ బ్యాక్ గ్రౌండ్ లో ఉండగా హన్సిక ఒక సింహాసనం లాంటి కుర్చీలో కూర్చొని సన్యాసి దుస్తుల్లో పొగతాగుతోంది. వెనక ఒక సాధువు కూడా కూర్చొని ఉన్నాడు.
ఈ పోస్టర్ రిలీజ్ ఆయన వెంటనే వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా పోస్టర్ వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని... ఇది తమ మతాన్ని కించపరిచేలా ఉందని కొన్ని సంస్థలు పోలీసు కేసు ఫైల్ చేయడం జరిగింది. దర్శకుడు యూ.ఆర్. జమీల్.. హీరోయిన్ హన్సిక లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేసిన వారు కోరుతున్నారు. ఈ పోస్టర్ వివాదం పై రీసెంట్ గా దర్శకుడు జమీల్ స్పందించాడు.
జమీల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఇలా వివరణ ఇచ్చాడు.. "ఏదైనా ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతో అలా చేశాను గానీ ఏ కులం.. మతం వారి సెంటిమెంట్లను కించపరచడం నా ఉద్దేశం కాదు. నేను మానవత్వాన్ని నమ్ముతా.. హిందూ ముస్లిం మతాలను కాదు. దయచేసి ఇందులో కులం మతం కోణాలను తీసుకురావద్దు." దర్శకుడి వివరణ అంతా ఒకే గానీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న జనాలు ఒప్పుకుంటారా లేదా అనేది వేచి చూడాలి.