ప్రేమకథా చిత్రాల స్పెషలిస్టుగా హను రాఘవపూడికి మంచి పేరు ఉంది. 'అందాల రాక్షసి' నుంచి ఆయనకి ఆ పేరు వచ్చేసింది. ప్రేమకథలకు సహజంగానే ఫీల్ ఎక్కువగా అవసరం అవుతుంది. ప్రేమికులకు సంబంధించిన సన్నివేశాలలోను .. మాటలలోను .. పాటలలోను అది కనిపించాలి. పైగా అది ఈ జనరేషన్ కి సాగదీసినట్టుగా అనిపించకూడదు. అలా ఈ మధ్య కాలంలో హను రాఘవపూడి తెరకెక్కించిన మరో ప్రేమకథా చిత్రమే 'సీతా రామం'. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాలో, దుల్కర్ - మృణాల్ నాయకా నాయికలుగా అలరించారు.
ఓ మాదిరి ఓపెనింగ్స్ తో మొదలైన ఈ సినిమా, ఆ తరువాత మౌత్ టాక్ తో పుంజుకుంది. ఓవర్సీస్ లో ఈ సినిమాకి వసూళ్ల వర్షం కురిసింది. మొత్తంగా చెప్పుకోవాలంటే ఈ మధ్యకాలంలో వచ్చిన ఓ క్లాసికల్ హిట్ అనిపించుకుంది. అలాంటి ఈ సినిమా కథ దుల్కర్ కంటే ముందుగా నానీతోను .. విజయ్ దేవరకొండతోను హను రాఘవపూడి చెప్పాడనీ, వాళ్లు ఒప్పుకోకపోవడం వల్లనే ఆయన దుల్కర్ వరకూ వెళ్లడం జరిగిందనే టాక్ ఈ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి నడుస్తూనే ఉంది. తాజా ఇంటర్వ్యూలో ఈ విషయంపై హను రాఘవపూడి క్లారిటీ ఇచ్చాడు.
"నేను ఈ కథను ముందుగా నానీ కి చెప్పాననే మాట అవాస్తవం. నేను అసలు ఈ కథను గురించి ఆయన దగ్గర ప్రస్తావించనే లేదు. నానీతో చేను చేయాలనుకున్న సినిమా వేరు. నానీతో నేను చేయాలనుకున్న కథ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జరుగుతుంది.
ఆ కథకి .. ఈ కథకి సంబంధమే లేదు. రెండూ ఆర్మీ నేపథ్యంలో కథలు కావడం వలన అలాంటి ఒక కథ బయటికి వచ్చి ఉంటుంది. మా కాంబినేషన్లో ఈ సినిమా తప్పకుండా ఉంటుంది. ఇక ఈ కథ కోసం హీరో రామ్ ను .. విజయ్ దేవరకొండను కూడా కలిసినట్టుగా నెట్టింట్లో షికారు చేస్తోంది . కానీ అందులో కూడా ఎలాంటి నిజం లేదు.
నేను ఎప్పుడూ కూడా హీరోలను దృష్టిలో పెట్టుకుని కథలు రాసుకోను. కథ రెడీ అయినా తరువాతనే ఆ పాత్రలకి ఎవరు సెట్ అవుతారనేది చూసుకుంటాను. విజయ్ దేవరకొండను 'వరల్డ్ ఫేమస్ లవర్' సమయంలో కలిశాను .. కానీ ఇది ఈ ప్రాజెక్టు కోసం కాదు.
అయినా విజయ్ దేవరకొండ లవ్ స్టోరీస్ చేయాలనే ఇంట్రెస్ట్ తో లేడు. ఇక రామ్ విషయం కూడా అంతే. ఆయన కోసం నేను అనుకున్న కథ వేరు. ఈ సినిమాకి ముందు వాళ్లను కలవడం వలన అది ఈ కథనే అయ్యుంటుందని అనుకుని ఉంటారు. కానీ ఈ కథ కోసం ముందుగా దుల్కర్ ను మాత్రమే అనువడం జరిగింది" అని ఆయన క్లారిటీ ఇచ్చేశాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.