తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న హనుమాన్ సినిమా టీజర్ తాజాగా విడుదల అయ్యి ప్రశంసలు దక్కించుకుంది. తక్కువ బడ్జెట్ తో ఇంత అద్భుతమైన విజువల్ వండర్ ను ఎలా తీసుకు రాబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో ఒక వర్గం వారు తెగ కామెంట్స్ చేస్తూ టీజర్ ను షేర్ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ చూస్తూ ఉంటే ఆదిపురుష్ కి కూడా పోటీ ఇచ్చే విధంగా ఉందంటూ కొందరు మాట్లాడుతున్నారు.
మొత్తానికి హనుమాన్ సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని.. సినిమాలోని హనుమాన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా కనిపించబోతుంది అన్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేస్తున్నారు. తాజాగా టీజర్ విడుదల కార్యక్రమంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాట్లాడుతూ ఈ సినిమా కేవలం తెలుగు సినిమా.. పాన్ ఇండియా సినిమా కాదని.. ఇది ఒక పాన్ వరల్డ్ మూవీ అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.
దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ... ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్థాయిలో రూపొందించమంటూ నిర్మాత నిరంజన్ రెడ్డి గారు ప్రొత్సహించారు. ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ హీరో హనుమాన్. మన హనుమాన్ హాలీవుడ్ కు చెందిన సూపర్ మ్యాన్.. బ్యాట్ మ్యాన్.. హిట్ మ్యాన్ ల కంటే చాలా పవర్ ఫుల్ అని.. యూనివర్శ్ సూపర్ హీరోస్ ల్లో హనుమాన్ అత్యంత గొప్ప శక్తివంతుడు అన్నాడు.
అలాంటి హనుమాన్ కథ కనుక ఇది కచ్చితంగా పాన్ వరల్డ్ మూవీ గా తాను భావిస్తున్నట్లుగా పేర్కొన్నాడు. హాలీవుడ్ సూపర్ హీరోస్ అందరికంటే కూడా హనుమాన్ గొప్ప సూపర్ హీరో అని మరోసారి నిరూపించే విధంగా మా సినిమా ఉంటుంది అన్నట్లుగా ప్రశాంత్ వర్మ పేర్కొన్నాడు.
బాల నటుడిగా తేజా సజ్జా నాకు బాగా తెలుసు. జాంబిరెడ్డి సినిమా తో మెయిన్ హీరో అయ్యాడు. ఆ వెంటనే మంచి సినిమాలు చేసి తానేంటో తాను నిరూపించుకున్నాడు. ఈ సినిమాకు ఎందుకు తేజా ను తీసుకున్నావు అంటూ చాలా మంది అడిగారు.
నా కథ కు అండర్ డాగ్ లాంటి నటుడు కావాలి. అలాంటి నటుడు తేజ అని నేను అనుకున్నాను. అందుకే ఈ సినిమాకు ఆయన్ను తీసుకున్నాను. ఈ సినిమా తర్వాత తేజ తప్పకుండా టాలీవుడ్ టాప్ స్టార్ అవుతాడనే నమ్మకం తనకు ఉందని దర్శకుడు అభిప్రాయం వ్యక్తం చేశాడు. అతి త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.