టాలీవుడ్ లో తొలి సూప‌ర్ హీరో మూవీ సంగ‌తులు

Update: 2021-08-24 09:30 GMT
టాలీవుడ్ లో మొదటి జోంబీ కామెడీ మూవీ `జోంబీ రెడ్డి` చేసిన తరువాత దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రస్తుతం మొదటి తెలుగు సూపర్ హీరో మూవీ `హను-మ్యాన్` చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. జోంబీ రెడ్డి హీరో తేజ సజ్జా ఈ సినిమాలో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇది అధునాత‌న సాంకేతిక‌త‌తో తెర‌కెక్కుతున్న చిత్రం. VFX సాంకేతిక‌త‌తో విజువ‌ల్ వండ‌ర్ గా నిలుస్తుంద‌ని తెలుస్తోంది.

ప్రశాంత్ వర్మ తాజా చిట్ చాట్ లో ఈ సినిమా క‌థ‌ను రివీల్ చేశారు. ఒక సాధారణ వ్యక్తికి సూపర్ పవర్స్ వచ్చినప్పుడు దాని పర్యవసానాల గురించిన చిత్ర‌మిది. ఇందులో హనుమంతుడు చేసే అద్భుతాల గురించి తెర‌పై చూపిస్తున్నాం. ఈ సూపర్ హీరో చిత్రంలో తన స్నేహితుడు తేజ సజ్జాను ఎందుకు హీరోగా ఎంపిక చేసుకున్నారో కూడా ప్ర‌శాంత్ వెల్లడించారు.

తేజ స‌జ్జా లాంటి న‌వ‌త‌రం హీరోకు అవ‌కాశం క‌ల్పిస్తే అద్భుతాలు చేయగలడని న‌మ్మాను. క‌థానుసారం ప్రేక్షకులు నమ్మేలా ఒక కొత్త ముఖాన్ని కావాల‌నుకుని అత‌డిని ఎంపిక చేసాన‌ని తెలిపారు. తేజ స‌జ్జా అప్ కం హీరోగా ప‌రిణ‌తిని క‌న‌బ‌రుస్తున్నారు. సూప‌ర్ హీరో చిత్రంతో అత‌డి స్థాయి మ‌రింత పెరుగుతుందేమో చూడాలి.
Tags:    

Similar News