#HBD నిశ్శ‌బ్ధంగా సూప‌ర్ జ‌ర్నీ చేశావ్ స్వీటీ

Update: 2020-11-07 07:02 GMT
2005లో సూప‌ర్ చిత్రంతో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైంది స్వీటీ శెట్టి అలియాస్ అనుష్క శెట్టి. వ‌రుస‌గా అగ్ర హీరోలు అగ్ర ద‌ర్శ‌కుల సినిమాల్లో న‌టించి అసాధార‌ణ స్టార్ డ‌మ్ ని అందుకుంది. ఇండ‌స్ట్రీలో నంబ‌ర్ వ‌న్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అనుష్క ఇటీవ‌ల వ్య‌క్తిగ‌త జీవితానికి ప్రాధాన్య‌త‌నిస్తూ కెరీర్ ప‌రంగా జోరు త‌గ్గించిన సంగ‌తి తెలిసిందే. ఆచితూచి సినిమాల‌కు సంత‌కాలు చేస్తున్న స్వీటీ పెళ్లికి సిద్ధ‌మ‌వుతోంద‌ని పుకార్లు షికార్ చేస్తున్నాయి.

నేడు స్వీటీ బ‌ర్త్ డే సంద‌ర్భంగా అభిమానులు స‌హోద్యోగులు స్వీటీకి శుభాకాంక్ష‌లు తెలిపారు. రుద్ర‌మ‌దేవి లాంటి క్లాసీ వారియ‌ర్ మూవీ తో పాటు.. ఎస్.ఎస్.రాజమౌళి  బాహుబలి పార్ట్ 1 .. బాహుబ‌లి 2 లో దేవసేన పాత్రను పోషించింది. ఈ పాత్ర‌తో ప్రపంచ వ్యాప్తంగా ప్ర‌త్యేక గుర్తింపు లభించింది.

అనుష్క శెట్టి 2005లో `సూపర్` చిత్రంతో తెర‌కు ప‌రిచ‌య‌మైంది. తొలి ప్ర‌య‌త్న‌మే ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటిగా ఎంపికైంది. ఆ తర్వాత ఆమె ఎస్ఎస్ రాజమౌళి తెర‌కెక్కించిన‌ `విక్రమార్కుడు` చిత్రంలో నటించింది. ఇది బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. అరుంధతి (2009) లో అనుష్క అద్భుత న‌ట‌న‌తో అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆకట్టుకుంది. ఉత్తమ నటిగా తన మొదటి ఫిలింఫేర్ అవార్డు - తెలుగు నంది అవార్డు గెలుచుకుంది. ఆ త‌ర్వాత వేదంలో న‌ట‌న‌కు రెండవ ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డు ద‌క్కింది. ఇక అనుష్క‌ కెరీర్ లో రుద్ర‌మ‌దేవిగా న‌టించి తన మూడవ ఫిలింఫేర్ ఉత్తమ నటి ట్రోఫీని గెలుచుకుంది.

త‌మిళంలో ప‌లువురు అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించిన అనుష్క సింగం- సింగం II- ఎన్నై అరింధాల్ -సి 3 వంటి సినిమాల్లో న‌టించింది. వనం- దేవ తిరుమగల్- ఇంజి ఇడుప్పజాగి లో న‌ట‌న‌కు ప్రశంసలను అందుకున్నారు.

ప్రభాస్ తో వ‌రుస సినిమాల్లో న‌టించి అత‌డికి మంచి స్నేహితురాలిగా మార‌డంతో ర‌క‌ర‌కాల గాసిప్స్ వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిన‌దే. అనుష్క న‌టించిన నిశ్శ‌బ్ధం ఇటీవ‌ల ఓటీటీలో రిలీజైంది. దీనికి మిశ్ర‌మ స్పంద‌న‌లు వ్య‌క్త‌మైన సంగ‌తి తెలిసిన‌దే. సూప‌ర్ (2005) నుంచి నిశ్శ‌బ్ధం (2020) వ‌ర‌కూ 15 సంత్స‌రాల కెరీర్ ని సాగించిన స్వీటీ అగ్ర నాయిక‌గా త‌న హోదాని కాపాడుకుంది. ఇక‌పై త‌న కెరీర్ జ‌ర్నీ ఎలా ఉండ‌నుందో చూడాలి. బ‌ర్త్ డే సంద‌ర్భంగా స్వీటీకి తుపాకి త‌ర‌పున శుభాకాంక్ష‌లు.
Tags:    

Similar News