తెలుగులో విలన్ పాత్రల్లో రాణించి ఆ తరువాత హీరోగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుని, అలా హీరోగానే నిలదొక్కుకున్న వారిలో గోపీచంద్ ఒకరుగా కనిపిస్తాడు. నిజానికి పవర్ ఫుల్ విలన్ గా మాస్ ఆడియన్స్ నుంచి మార్కులు కొట్టేసి, ఆ తరువాత ఫ్యామిలీ హీరోగా మెప్పించడం అంత ఆషామాషీ విషయమేం కాదు. విలన్ ముద్ర నుంచి బయటపడి హీరో అనిపించుకోవడం అనుకున్నంత తేలిక కాదు. అందుకు ఎంతో పట్టుదల .. కృషి అవసరం. ఆ దిశగా అడుగులు వేసి అనుకున్న లక్ష్యానికి చేరుకోవడంలో గోపీచంద్ సక్సెస్ అయ్యాడు.
మంచి హైటూ .. అందుకు తగిన ఫిజిక్ తో గోపీచంద్ ఆరడుగుల బుల్లెట్ లా కనిపిస్తాడు. అందువలన ఆయన ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో 'తొలివలపు' సినిమా ద్వారా తెలుగు తెరకి హీరోగా పరిచయమయ్యాడు. ఆ సినిమా హీరోగా ఆయనకి ఆశించినస్థాయి గుర్తింపును తెచ్చిపెట్టలేదు. దాంతో ఆ తరువాత సినిమాలో విలన్ గా ప్రత్యక్షమయ్యాడు. 'జయం' సినిమాలో విలన్ గా ఆయన పోషించిన పాత్ర, అంతకుముందు ఆయన చేసిన హీరో పాత్రను గుర్తులేకుండా చేసింది. ఆ తరువాత విలన్ గా చేసిన 'వర్షం' సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఆయన చేసిన విలన్ రోల్ ఆ సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఇలాంటి విలన్ ను ఈ మధ్య కాలంలో చూడలేదని ప్రేక్షకులు చెప్పుకున్నారు.
అంతటి పవర్ఫుల్ విలన్ పాత్ర తరువాత, మళ్లీ 'యజ్ఞం' సినిమాతో హీరోగా రీ ఎంట్రీ ఇవ్వడం నిజంగా ఆయన చేసిన సాహసమే. ఆ సినిమా హీరోగా ఆయన కెరియర్ కి చాలా హెల్ప్ అయింది. ముందుగా యాక్షన్ హీరో అనిపించుకున్న గోపీచంద్, ఆ తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా థియేటర్లకు రప్పించగలిగాడు. వరుస సక్సెస్ లు పలకరించకపోయినా, ఆయన తన ప్రయాణాన్ని మాత్రం ఆపలేదు. ఆయన కెరియర్ బాగా స్లో అవుతుందని అనిపించిన సమయాల్లో 'లక్ష్యం' .. 'లౌక్యం' .. 'జిల్' వంటి సినిమాలు ఆదుకున్నాయి.
ఇక డాన్స్ పరంగా .. కామెడీ పరంగా తనకి గల బలహీనతలను కూడా గోపీచంద్ అధిగమించాడు. ఒక వైపున మాస్ ఆడియన్స్ ను .. మరో వైపున ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించే కంటెంట్ ను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ట్రెండుకి తగినట్టుగా తనని తాను మలచుకుంటూ కొత్తగా కనిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన సినిమాలో 'సీటీమార్' రిలీజ్ కి సిద్ధంగా ఉండగా, 'పక్కా కమర్షియల్' సెట్స్ పైకి వెళుతోంది. ఈ రోజున ఆయన పుట్టినరోజు .. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరిన్ని విజయాలను సాధించాలని కోరుకుందాం.