టాలీవుడ్ లో యువకథానాయకుల మధ్య పోటీ గట్టిగా ఉంది. ప్రతి ఒక్కరూ రేసులో నిలబడటానికి తమవంతు ప్రయత్నాలు చేస్తూ వెళుతున్నారు. తమ సినిమాల సంఖ్య .. ఆడియన్స్ లో తమకి గల క్రేజ్ .. తమ మార్కెట్ ఎంతమాత్రం తగ్గకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పరుగులు పెడుతున్నారు. అయితే పరిగెత్తి పాలు తాగడం కంటే, నుంచుని నీళ్లు తాగడం మంచిదనే కథానాయకుడిగా శర్వానంద్ కనిపిస్తాడు. మన్నికైన పాత్రల్లో నాణ్యత కలిగిన నటుడిగా మెప్పిస్తాడు. అందుకే ఆయనకి యూత్ లోను .. ఫ్యామిలీ ఆడియన్స్ లోను మంచి ఫాలోయింగ్ ఉంది. అలాంటి శర్వానంద్ పుట్టినరోజు .. ఈ రోజు.
కథల ఎంపిక విషయంలో తడబాటు .. తొందరపాటు శర్వానంద్ లో కనిపించవు. నిదానంగా కథలను ఎంచుకుంటూ .. నింపాదిగా ముందుకు వెళ్లడమే ఆయన ప్రత్యేకతగా అనిపిస్తుంది. నటుడిగా శర్వానంద్ తన కెరియర్ ను మొదలుపెట్టేసి 16 ఏళ్లు పూర్తయ్యాయి. సుదీర్ఘమైన ఈ ప్రయాణంలో ఆయన ఎన్నో విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను పోషించాడు. సినిమాల సంఖ్యకంటే సక్సెస్ రేటుకు ఆయన ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చాడనే విషయం అర్థమవుతుంది. తొలినాళ్లలో చిన్న చిన్న పాత్రలతోనే తన కెరియర్ ను మొదలుపెట్టిన ఆయన, ఆ తరువాత 'గమ్యం' సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయనలో మంచి నటుడు ఉన్నాడనే విషయాన్ని ఈ సినిమా చాటి చెప్పింది. 'రన్ రాజా రన్' నుంచి ఆయన కెరియర్ నెక్స్ట్ లెవెల్లో సాగింది.
'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' సినిమాతో తనలోని నటుడిని కొత్త కోణంలో ఆవిష్కరించిన శర్వానంద్, 'శతమానం భవతి'తో ఎమోషన్స్ ను .. 'మహానుభావుడు'తో కామెడీని ఎంతబాగా పండించగలననేది నిరూపించాడు. అన్నిరకాల పాత్రలను ఆయన నడిపించగలడు .. గెలిపించగలడు అనే నమ్మకాన్ని దర్శక నిర్మాతల్లో కలిగించాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకులను పలకరించడానికి 'శ్రీకారం' సిద్ధమవుతోంది. ఈ సినిమాలో ఆయన రైతుగా కనిపించనుండటం ప్రత్యేకతను .. ప్రాధాన్యతను సంతరించుకుంది. శివరాత్రి కానుకగా ఈ నెల 11వ తేదీన థియేటర్లకు రానున్న ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి నెలకొంది.
కథల ఎంపిక విషయంలోను .. కొత్తదనానికి ప్రాధాన్యతను ఇచ్చే విషయంలోను నాని తరువాత స్థానంలో శర్వానంద్ పేరు కనిపిస్తూ ఉంటుంది. ఇతర హీరోలను తనకి పోటీగా భావించడం .. చకచకా సినిమాలు చేయాలనే ఆత్రుత చూపడం .. బయట ఫంక్షన్స్ లో సందడి చేయడం .. తన సినిమా హిట్ అయితే హడావిడి చేయడం .. ఫ్లాప్ అయితే కుంగిపోవడం .. ఇలాంటివేమీ శర్వానంద్ లో కనిపించవు. తెరపై ఆయన పరిణతి కలిగిన నటుడిగా కనిపించినట్టే, బయటకూడా అంతే పరిణతితో వ్యవహరిస్తాడు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరిన్ని మంచి చిత్రాలు ఆయన నుంచి రావాలని ఆశిద్దాం.