టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ అనగానే ఏమాత్రం సినీ పరిజ్ఞానం ఉన్న వారు అయినా ఠక్కున చెప్పే పేరు కృష్ణవంశీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి సినిమా గులాబి నుండి మొదలుకుని తన ప్రతి సినిమాలో కూడా కొత్త ట్రెండ్ ను చూపిస్తూ తన క్రియేటివిటీతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ.. ఆలోచింపజేస్తూ హీరోలను స్టార్స్ గా మార్చిన ఘనత కృష్ణవంశీ సొంతం.
ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ నటన ఏ సినిమాల్లో అంటే ఖచ్చితంగా రాఖీ సినిమా ఉంటుంది. ఇక మహేష్ బాబుకు మురారి.. నాగార్జునకు నిన్నే పెళ్లాడతా ప్రభాస్ కు చక్రం సినిమాలు కెరీర్ లో నిలిచి పోయేలా చేసి పెట్టిన క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ పుట్టిన రోజు నేడు. ఈ సందర్బంగా ఆయన గురించి కొన్ని విషయాలు అందరికి తెలిసినవే అయినా మరోసారి తెలియని వారి కోసం..
కృష్ణవంశీ అసలు పేరు పసుపులేటి వెంకట బంగార్రాజు. ఇంగ్లీష్ లో మంచి పట్టు ఉండి క్రియేటివ్ గా ఆలోచిస్తాడు.. అతడి రాతలో కొత్తదనం ఉంటుంది అంటూ శివ సినిమా సమయంలో రామ్ గోపాల్ వర్మకు శివ నాగేశ్వరరావు పరిచయం చేశాడు. రామ్ గోపాల్ వర్మ కు శిష్యుడుగా కృష్ణవంశీ అధికారికంగా సినీ ప్రస్థానం మొదలు పెట్టాడు.
శివ సినిమా సమయంలో కృష్ణవంశీ పనితనంతో రామ్ గోపాల్ వర్మకు చాలా దగ్గర అయ్యాడు. దాంతో స్వయంగా రామ్ గోపాల్ వర్మ ఆయన్ను దర్శకుడిగా గులాబి చిత్రంతో పరిచయం చేశాడు. శివ సమయంలోనే కృష్ణవంశీ గురించి తెలిసిన నాగార్జున నిన్నే పెళ్లాడతా సినిమా చేసే అవకాశంను ఇచ్చాడు. అప్పటి వరకు నాగార్జున చేసిన సినిమాలకు పూర్తి విభిన్నంగా నిన్నేపెళ్లాడతా చేసి అందులో కొత్తగా చూపించి సూపర్ హిట్ ను అందించాడు.
కృష్ణవంశీ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సిందూరం సినిమా కమర్షియల్ గా నిరాశ పర్చినా కూడా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఒక విభిన్నమైన సినిమాగా అది ఇప్పటికి నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. రవితేజలోని కొత్త యాంగిల్ ను చూపించి హీరోగా నిలబెట్టాడు. కృష్ణవంశీ ఈమద్య కాలంలో దర్శకుడిగా నిరాశ పర్చుతున్నాడు.
ఆయన క్రియేటివిటీ కి కాస్త కమర్షియల్ హంగులు అద్దితే మళ్లీ ఖచ్చితంగా ఆయన నుండి మరో మురారి లేదా నిన్నే పెళ్లాడతా వంటి సినిమా వస్తుంది అనడంలో సందేహం లేదు.
ఎంతో మంది హీరోలు ఆయనతో వర్క్ చేసేందుకు సిద్దంగా ఉన్నా కూడా ఆచి తూచి చిన్న సినిమాలను చేస్తూ మళ్లీ తనను తాను నిరూపించుకునేందుకు దర్శకుడు కృష్ణవంశీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరు పదుల వయసుకు చేరువ అయిన కృష్ణవంశీ ముందు ముందు మరిన్ని కమర్షియల్ బ్లాక్ బస్టర్ సినిమాలు తీయాలని ఆయన సగటు అభిమానులు కోరుకుంటున్నారు.
ఆయన నుండి ముందు ముందు రాబోతున్న ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని.. అవ్వాలని కోరుకుంటున్నాం. హ్యాపీ బర్త్ డే క్రియేటివ్ జీనియస్ కృష్ణవంశీ గారు.