నీహారిక పెళ్ళికి డేట్ ఫిక్స్ చేసారు

Update: 2018-06-18 11:50 GMT
అదేంటి మెగా డాటర్ పెళ్లి చెప్పా పెట్టకుండా చేస్తున్నారా అని ఆశ్చర్యపోకండి. ఇది సినిమా ప్రమోషన్ లో చిన్న ఎత్తుగడ అంతే. సుమంత్ అశ్విన్ నీహారిక జంటగా లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో రూపొందుతున్న హ్యాపీ వెడ్డింగ్ సినిమాకు సంబంధించిన తొలి ఆహ్వానాన్ని ఈ నెల 21న విడుదల చేయబోతున్నారు. అందులో ఫస్ట్ లుక్ ఉంటుందా లేక ట్రైలర్ వదులుతారా లేక విడుదల తేదీ ప్రకటిస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కానీ పెళ్లి జంట ఆ ఇద్దరు అన్నది మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది. యువి లాంటి పెద్ద సంస్థ సమర్పిస్తుంది కాబట్టి మార్కెటింగ్ విషయంలో చాల శ్రద్ధ తీసుకుంటున్నారు. హీరో హీరోయిన్లు ఇద్దరూ మార్కెట్ లో బజ్ లేని వాళ్ళు కావడంతో ఇలాంటివి వినూత్నంగా  చేయక తప్పదు. నీహారిక మెగా కార్డు తో ఎంట్రీ ఇచ్చినప్పటికీ మొదటి సినిమా ఒక మనసు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఆ మధ్య విజయ్ సేతుపతితో ఒక ఫాంటసీ మూవీతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కానీ అదీ వర్క్ అవుట్ కాలేదు.

ఇక నాగ అశ్విన్ సంగతి సరేసరి. ఫ్యాషన్ డిజైనర్ తర్వాత మరో సినిమా వచ్చిన జాడ లేదు. ఇప్పుడు ఆశలన్నీ హ్యాపీ వెడ్డింగ్ మీదే పెట్టుకున్నాడు. ఒక పెళ్లి తతంగాన్ని అందంగా అనుబంధాలను హై లైట్ చేస్తూ లక్ష్మణ్ దీన్ని తీర్చిదిద్దినట్టు ఇన్ సైడ్ టాక్. హిట్ అయితే మాత్రం అతనితో పాటు హీరో హీరోయిన్స్ కు కూడా కావాల్సిన బ్రేక్ దొరుకుతుంది . ప్రమోషన్ లో కొత్త పోకడలు వస్తున్న నేపథ్యంలో ఎంత వెరైటీగా ఆలోచిస్తే అంతగా జనంలోకి చొచ్చుకుపోయి ఛాన్స్ ఉంది. పెద్ద హీరోల సినిమాలకే ఈ తిప్పలు తప్పడం లేదు. ఇక హ్యాపీ వెడ్డింగ్ గురించి చెప్పేదేముంది. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తున్న ఈ మూవీకి శక్తికాంత్ కార్తీక్ ట్యూన్స్ కంపోజ్ చేసాడు. నీహారికకు దీనితో అయినా బ్రేక్ రావాలని మెగా ఫాన్స్ కోరిక. కంటెంట్ కనక ఆశించిన రేంజ్ లో ఉంటె అదేమంత పెద్ద విషయం కాదు కానీ అటు అశ్విన్ తో ఇటు నీహారికతో దోబూచులాడుతున్న విజయ లక్ష్మి ఈసారైనా వీళ్ళను వరిస్తుందా వేచి చూడాలి.
Tags:    

Similar News