చిత్రం : ‘హ్యాపీ వెడ్డింగ్’
నటీనటులు: సుమంత్ అశ్విన్ - కొణిదెల నిహారిక - మురళీ శర్మ - తులసి - నరేష్ - పవిత్ర లోకేష్ - ఇంద్రజ - రాజా - అన్నపూర్ణ తదితరులు
సంగీతం: శక్తికాంత్ కార్తీక్
నేపథ్య సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: బాల్ రెడ్డి
మాటలు: భవానీ ప్రసాద్
నిర్మాణం: యువి క్రియేషన్స్ - పాకెట్ సినిమా
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: లక్ష్మణ్ కార్య
మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి పరిచయమైన తొలి కథానాయిక కొణిదెల నిహారికకు తొలి సినిమా ‘ఒక మనసు’ చేదు అనుభవాన్ని మిగిల్చింది. దీంతో ఈసారి బాగా గ్యాప్ తీసుకుని ‘హ్యాపీ వెడ్డింగ్’ సినిమా చేసింది నిహారిక. సుమంత్ అశ్విన్ ఆమెకు జోడీగా నటించిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు లక్ష్మణ్ కార్య రూపొందించాడు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
శారీ డిజైనర్ అయిన అక్షర (నిహారిక).. యాడ్ ఫిలిం మేకర్ అయిన ఆనంద్ (సుమంత్ అశ్విన్) అనుకోకుండా పరిచయమై ప్రేమలో పడతారు. ఇరు కుటుంబాల పెద్దలూ అంగీకరించడంతో వీరి పెళ్లికి రంగం సిద్ధమవుతుంది. ఐతే పెళ్లి నిశ్చయం అయ్యాక అక్షరకు ఆనంద్ మీద సందేహాలు మొదలవుతాయి. పరిచయమైన తొలి రోజుల్లో తనపై ఉన్న ప్రేమ.. ఆసక్తి క్రమంగా తగ్గిపోతున్నాయని కంగారు పడుతుంది. అదే సమయంలో ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ విజయ్ (రాజా) తిరిగి ఆమె జీవితంలోకి వస్తాడు. దీంతో తన జీవిత భాగస్వామిగా ఎవరిని ఎంచుకోవాలో తెలియని సందిగ్ధంలో పడుతుంది అక్షర. మరి ఆమె ఈ సందిగ్ధత నుంచి ఎలా బయటపడింది.. ఎవరితో జీవితాన్ని పంచుకుంది అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
‘హ్యాపీ వెడ్డింగ్’ పెళ్లి విషయంలో ఈ తరం యువత ఆలోచనల గురించి చర్చిస్తూ వాస్తవికంగా సాగే సినిమా. ఒకప్పటిలా పెళ్లి విషయంలో అమ్మాయిలపై వేరే వాళ్లు తమ అభిప్రాయాల్ని రుద్దట్లేదిపుడు. చాలామంది తల్లిదండ్రులు తమ కూతుళ్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నారు. వాళ్ల అభిప్రాయాల్ని గౌరవిస్తున్నారు. మరి పెళ్లి చేసుకుని కొత్తగా మరో ఇంటికి వెళ్లబోయే అమ్మాయిలో ఎలాంటి భయాలుంటాయి.. జీవిత భాగస్వామి విషయంలో ఆమె ఎలాంటి అభద్రత భావానికి గురవుతుంది.. తాను ఎలాంటి స్థితిలో అయినా.. ఏ అభిప్రాయమైనా సొంతంగా తీసుకునే.. జీవితాన్ని నిర్దేశించుకునే అవకాశమున్నపుడు ఒక అమ్మాయి ఎలా స్పందిస్తుందనే విషయాన్ని ‘హ్యాపీ వెడ్డింగ్’లో చర్చించారు. ఈ కథ.. ఇందులోని పాత్రలు కంటెంపరరీగా ఉన్నప్పటికీ.. ఈ తరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గ వేగం కానీ.. ఆసక్తికర మలుపులు కానీ ఇందులో ఏమీ లేకపోయాయి. నరేషన్ స్లోగా ఉండటం.. చిన్న కథను మరీ సాగదీయడం.. కాన్ఫ్లిక్ట్ పాయింట్ కూడా చిన్నది కావడం ‘హ్యాపీ వెడ్డింగ్’కు ప్రతికూలంగా మారాయి.
ఒకమ్మాయి పరిచయమైన కొత్తలో.. ప్రేమ మొదలయ్యే ముందు.. మొదలైన కొన్ని రోజుల వరకు ఆమె పట్ల చాలా కేరింగ్ గా ఉండే అబ్బాయి.. ఆ అమ్మాయి ప్రేమను ఓకే చేశాక.. తనపై ఎందుకు అంత కేరింగ్ గా ఉండడు అనే పాయింట్ మీద ‘హ్యాపీ వెడ్డింగ్’ నడుస్తుంది. సినిమాలో ఇదే కాన్ఫ్లిక్ట్ పాయింట్. ఐతే ఈ పాయింట్ మీద కథ మలుపు తిప్పేందుకు కొత్త దర్శకుడు లక్ష్మణ్ కార్య ఎంచుకున్న ఎపిసోడ్ మాత్రం మరీ చిన్నదైపోయింది. ఒక్కో వ్యక్తి వరకు తీసుకుంటే చిన్న సమస్యే చాలా పెద్దదిగా కనిపించొచ్చు. ఐతే ఒక సినిమాలో చూపించేటపుడు మాత్రం సమస్య కొంచెం పెద్దదిగానే ఉండాలని ఆశిస్తాం. ఐతే ‘హ్యాపీ వెడ్డింగ్’లో హీరో కోసం తాను హైదరాబాద్ విజయవాడ వెళ్తే.. అతను తనను వెంటనే కలవడానికి రాలేదన్న కారణంతో కోపం తెచ్చుకుని తీవ్ర నిర్ణయానికి సిద్ధపడుతుంది కథానాయిక. ఆమె నిర్ణయానికి అదొక్కటే కారణం కాకపోయినా.. ఆమె చెప్పే ఇతర కారణాలు కూడా కన్విన్సింగ్ గా అనిపించినా.. దీన్నే కాన్ఫ్లిక్ట్ పాయింట్ గా ఎంచుకుని అక్కడి నుంచి చాలా దూరం కథ నడిపించడంతో తీవ్రత తగ్గిపోయింది. పైగా హీరోయిన్ ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నప్పటికీ పెళ్లి రోజు వరకు కూడా తన గందరగోళాన్ని కొనసాగించడం.. ఏ నిర్ణయం తీసుకోకుండా అలా ఉండిపోవడం అంత సహేతుకంగా అనిపించదు. దీని వల్ల కథను అనవసరంగా సాగదీసిన.. నాటకీయంగా మార్చిన భావన కలుగుతుంది.
ఆరంభంలో హాయిగా.. ఆహ్లాదంగా సాగే ‘హ్యాపీ వెడ్డింగ్’ ఒక దశ దాటాక చాలా సాధారణంగా మారిపోతుంది. సినిమాను చివరిదాకా నడిపించడం కోసమే.. హీరోయిన్ని కన్ఫ్యూజన్లో పెట్టినట్లుగా కనిపిస్తుంది. మొదట్లో లవ్ ట్రాక్ పేరుతో డ్యూయెట్లు.. రొమాన్స్ అంటూ కాలక్షేపం ఏమీ చేయకుండా.. పరిణతితో కూడిన సన్నివేశాలతో సినిమాను నడిపించాడు దర్శకుడు లక్ష్మణ్. సన్నివేశాల్లోని సహజత్వం.. సింప్లిసిటీ ఆకట్టుకుంటాయి. కానీ కాన్ఫ్లిక్ట్ పాయింటే చాలా వీక్ అయిపోవడం.. ఆ తర్వాత ఊరికే సాగదీయడంతో నీరసం వచ్చేస్తుంది. హీరోయిన్ నిర్ణయం కోసం హీరో ఎలా అయితే అసహనంతో ఎదురు చూస్తాడో.. అదే భావన ప్రేక్షకుల్లో కూడా కలుగుతుంది. హీరోయిన్ ప్రవర్తనే అసలర్థం కాదు. ‘హ్యాపీ వెడ్డింగ్’లో కొన్ని మంచి డైలాగులున్నప్పటికీ.. దృశ్య ప్రధానంగా సాగాల్సిన సినిమాలో మరీ ఎక్కువ డైలాగులున్నా ఇబ్బందే అనిపిసిస్తుంది. కథలో చెప్పుకోదగ్గ మలుపులేమీ లేకపోగా.. కేవలం మాటల ద్వారానే కథను చెప్పే ప్రయత్నం జరిగింది. కొన్ని చోట్ల కొన్ని పాత్రలు మనకేదో క్లాస్ పీకుతున్న ఫీలింగ్ కలుగుతుంది. మొత్తానికి ఈ తరం యువతకు కనెక్టయ్యే కథనే ఎంచుకున్నప్పటికీ.. వాళ్లకు రుచించేలా చెప్పలేకపోవడంతో ‘హ్యాపీ వెడ్డింగ్’ నిరాశనే మిగులుస్తుంది.
నటీనటులు:
‘హ్యాపీ వెడ్డింగ్’లో పాత్ర.. నటన పరంగా స్టాండ్ ఔట్ గా నిలిచేది నిహారికనే. ఆమె కోసమే ఈ సినిమా తీసినట్లుగా అనిపిస్తుంది. హీరో కూడా ఉన్నప్పటికీ కథంతా నిహారిక చుట్టూనే తిరుగుతుంది. అంత కీలకమైన పాత్రలో నిహారిక బాగానే చేసింది. ఆమె నటనలో పరిణతి కనిపిస్తుంది. పెళ్లి చేసుకుని మరో ఇంటికి వెళ్లిపోయే అమ్మాయిలో ఉండే భయాన్ని.. బాధను ఆమె బాగా పలికించింది. ఒకట్రెండు సన్నివేశాల్లో కొంత తడబడ్డప్పటికీ.. సినిమా అంతా అయ్యేసరికి నిహారిక మెప్పిస్తుంది. సుమంత్ అశ్విన్ కూడా బాగానే చేశాడు. ఐతే మొదట్లో మరీ అత్యుత్సాహంతో.. అవసరానికి మించిన పాజిటివ్ యాటిట్యూడ్ తో సుమంత్ కొంచెం అసహజంగా కనిపిస్తాడు. ఐతే ద్వితీయార్ధంలో మరో కోణాన్ని చూపిస్తూ సాగే అతడి పాత్ర ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాల్లో అతను చాలా బాగా నటించాడు. మురళీ శర్మ మరోసారి సింపుల్ గా పాత్రలో ఒదిగిపోయాడు. నరేష్ కు అంత స్కోప్ లేకపోయింది. తులసి.. పవిత్ర లోకేష్.. ఇంద్రజ.. ముగ్గురూ ఓకే. సిరివెన్నెల సీతారామశాస్త్రి తనయుడు రాజా పర్వాలేదు.
సాంకేతిక వర్గం:
శక్తికాంత్ కార్తీక్ సంగీతం పర్వాలేదు. రెండు పాటలు మంచి ఫీలింగ్ ఇస్తాయి. ఐతే ఇలాంటి సినిమాలో పాటలు మరింత బాగా ఉండాల్సిందనిపిస్తుంది. తమన్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. బాల్ రెడ్డి ఛాయాగ్రహణం బాగుంది. సినిమా టోన్ కు తగ్గట్లుగా సాగుతుంది కెమెరా వర్క్. నిర్మాణ విలువలు జస్ట్ ఓకే అనిపిస్తాయి. పరిమిత బడ్జెట్లోనే సినిమా తీసినట్లున్నారు. యువి క్రియేషన్స్ లేటుగా ఈ ప్రాజెక్టులోకి రావడం వల్లేమో వాళ్ల మార్కేమీ ఇందులో కనిపించలేదు. భవానీ ప్రసాద్ మాటలు కొన్ని చోట్ల బాగున్నా.. డోస్ ఎక్కువైపోయింది. ఇక కొత్త దర్శకుడు లక్ష్మణ్ ఒక సింపుల్ కథను ఎంచుకుని.. సింపుల్ గా చెప్పే ప్రయత్నం చేశాడు. కథలో ఇంకొంచెం బలమైన అంశాలు ఉండేలా చూసుకోవాల్సింది. కథనంలో వేగం చూపించాల్సింది. వెబ్ సిరీస్ తరహాలో సినిమాను నడిపించాడు. ఫీచర్ ఫిలిం స్థాయికి అతడి ప్రతిభ సరిపోలేదు.
చివరగా: హ్యాపీ వెడ్డింగ్.. నాట్ హ్యాపీ
రేటింగ్-2/5
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre