క్రిష్ స్టైల్‌ కు విరుద్దంగా 'హరి హరి వీరమల్లు'

Update: 2021-08-17 11:30 GMT
సింపుల్‌ అండ్‌ యూనిక్‌ డైరెక్టర్‌ క్రిష్‌ అనడంలో సందేహం లేదు. క్రిష్‌ దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా కూడా విభిన్నంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. క్రిష్‌ తన ప్రతి సినిమాను కూడా చాలా తక్కువ సమయంలోనే పూర్తి చేశాడు. కంచె వంటి యుద్ద నేపథ్యం సినిమాను కూడా చాలా తక్కువ సమయంలో పూర్తి చేసి అందరిని ఆశ్చర్యపర్చాడు. ఇక బాలకృష్ణ తో క్రిష్‌ తెరకెక్కించిన గౌతమి పుత్ర శాతకర్ణి కూడా చాలా తక్కువ సమయంలోనే పూర్తి అయ్యింది. షూటింగ్ మొదలు పెట్టాడు అంటే పూర్తి అయ్యే వరకు క్రిష్‌ కంటిన్యూగా చేస్తూనే ఉంటాడు. ప్రస్తుతం హరి హర వీరమల్లు సినిమాను క్రిష్‌ చేస్తున్నాడు. పవన్‌ హీరోగా నటిస్తున్న ఆ సినిమా షూటింగ్ మొదలు అయ్యి చాలా కాలం అయ్యింది. కాని కరోనా మరియు ఇతరత్ర కారణాల వల్ల ఆలస్యం అవుతోంది.

హరి హర వీరమల్లు సినిమాకు ముందు వైష్ణవ్ తేజ్ తో కొండపొలం సినిమాను కేవలం 45 రోజుల్లోనే తెరకెక్కించిన దర్శకుడు క్రిష్‌ ఆ సినిమా ను విడుదల చేయకుండా హరి హర వీరమల్లు సినిమాపై పడ్డాడు. హరి హర వీమరల్లు విడుదల అయిన తర్వాత కొండ పొలం సినిమాను విడుదల చేయాలని మొదట భావించాడట. కాని హరి హర వీరమల్లు సినిమా ఇప్పట్లో పూర్తి అయ్యేలా లేదు.. ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఇంకా చాలా సమయం పట్టేలా ఉందని భావిస్తున్నారు. అందుకే క్రిష్‌ ఇప్పుడు కొండ పొలం ను విడుదల చేసేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న హరి హర వీరమల్లు సినిమాను సెకండ్‌ వేవ్‌ కు ముందు 2022 సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా అదికారికంగా ప్రకటించారు. కాని షూటింగ్ ఆలస్యం అవ్వడంతో పాటు పవన్‌ రాజకీయాలు.. అనారోగ్యాలు ఇతర సినిమాలు ఇలా పలు కారనాల వల్ల సినిమాను సంక్రాంతికి కాకుండా వచ్చే ఏడాది సమ్మర్‌ లేదా దసరాకు వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సరే షూటింగ్‌ పూర్తి చేస్తే విడుదల విషయం తర్వాత ఆలోచించవచ్చు అని క్రిష్ అనుకుంటున్నాడట. కాని పవన్‌ బిజీ బిజీ కారణంగా క్రిష్ మరే పని లేకుండా పవన్‌ డేట్ల కోసం వెయిట్‌ చేస్తూ ఉన్నాడని అంటున్నారు. స్టార్‌ హీరోలతో సినిమాలు చేయాలంటే ఈమద్య దర్శకులు వెయిట్‌ చేయాల్సి వస్తోంది. పవన్ తో సినిమా అంటే ఇంకాస్త ఎక్కువగా వెయిట్‌ చేయాల్సి ఉంటుందని మరోసారి క్రిష్ వల్ల నిరూపితం అయ్యిందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు గుసగుసలాడుకుంటున్నారు.


Tags:    

Similar News