దిల్ రాజుతో గొడవ స్పందించిన హరీష్ శంకర్

Update: 2019-09-16 06:47 GMT
సినిమా మొదలయ్యే ప్రాసెస్ లో దర్శక నిర్మాతలకు కొన్ని క్రియేటీవ్ డిఫరెన్సెస్ రావడం సహజమే. కొన్ని సందర్భాల్లో అవి బయట పడితే కొన్ని సార్లు లోలోపలే ఉండిపోతాయి. అయితే మొన్నీ మధ్యే హరీష్ శంకర్ దిల్ రాజు కి మధ్య విభేదాలు వచ్చాయని అందుకే వీరిద్దరి కాంబినేషన్ లో రావాల్సిన 'దాగుడు మూతలు' అటకెక్కిందనే వార్తలు చక్కర్లు కొట్టాయి.

ఇందులో కొంత నిజం లేకపోలేదు. 'డీజే' తర్వాత హరీష్ శంకర్ తో మళ్లీ సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేసాడు దిల్ రాజు. 'దాగుడుమూతలు' అనే టైటిల్ ఖరారు అయినట్లు శర్వా, నితిన్ లతో ఆ సినిమా చేస్తున్నట్లు చెప్పాడు కూడా. అయితే అనుకోకుండా ఆ సినిమా ప్రారంభం అవ్వకముందే ఆగిపోయింది. దాంతో ఉన్నపళంగా హరీష్ శంకర్ 14 రీల్స్ నిర్మాతలను కలిసి తమిళ్ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యాడు. అదే 'వాల్మీకి'. అయితే సినిమా చేస్తున్న సమయంలో రామ్ ఆచంట, గోపి ఆచంటలతో కూడా హరీష్ కి విభేదాలు వచ్చాయనే టాక్ వచ్చింది.

అయితే వీటి గురుంచి లేటెస్ట్ గా స్పందించాడు హరీష్. తనకు నిర్మాతలకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని, వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టిన ప్రతీ సారి తనే కంట్రోల్ చేశానని చెప్పుకొచ్చాడు. కొత్త బ్యానర్ తన సినిమాతో లాంచ్ అవుతున్నందుకు హ్యాపీ అన్నాడు. ఇక దిల్ రాజు గారి తో కూడా పెద్దగా విభేదాలు ఏమి లేవని, కాకపొతే కాస్టింగ్ విషయంలోనే ఆయనతో ఇబ్బంది అంటూ చెప్పాడు. ప్రస్తుతం మా మధ్య ఎలాంటి గొడవలు లేవని 'వాల్మీకి' ను ఆయన వైజాగ్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారని తెలిపాడు. త్వరలోనే దాగుడు మూతలు తీస్తానని అది ఎప్పుడనేది మాత్రం ఇంకా తెలియదని అన్నాడు.
    

Tags:    

Similar News