ఊహించని రీతిలో హరికృష్ణ మరణం తెలుగు ప్రజలకు షాకింగ్ గా మారింది. బుధవారం ఉదయం ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించటంపై ఆయన స్నేహితుడు ప్రకాశ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టి పడేలా చేస్తున్నాయి. ఉదయం నుంచి హరికృష్ణ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తుంటే.. ఆయన మరణవార్త వినాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హరికృష్ణ మరణంపై ఆయన దిగ్బాంత్రి వ్యక్తం చేస్తున్నారు. కావలిలో జరిగే ఒక వేడుకకు హాజరయ్యేందుకు వెళ్లిన హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆయన ఎప్పుడు.. ఏ ఊరికి వెళ్లినా ముగ్గురుతో వెళ్లే వారు కాదని.. అది ఆయన సెంటిమెంట్ గా ఆయన స్నేహితుడు ప్రకాశ్ చెబుతున్నారు. మంగళవారం రాత్రి తనకు ఫోన్ చేసి.. నెల్లూరు జిల్లాకు వెళ్లాల్సి ఉంటుందని.. ఉదయమే సిద్ధంగా ఉండాలని హరికృష్ణ తనకు చెప్పారన్నారు.
దీంతో.. ఈ ఉదయం ఆయన ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తుంటే.. ఆయన మరణవార్త వినాల్సి వచ్చిందని వాపోయారు. కారులో మొత్తం నలుగురం వెళ్లాల్సి ఉన్నా.. ముగ్గురే ఎందుకు బయలుదేరారో తనకు అర్థం కావటం లేదన్నారు. హరికృష్ణ ఎప్పుడూ ముగ్గురుగా వెళ్లరని.. అది ఆయన సెంటిమెంట్ అని.. అలాంటి అందుకు భిన్నంగా ఆయన చేసిన ప్రయాణం.. చివరి ప్రయాణంగా మారటం గమనార్హం. కారును నడిపే సమయంలో చాలా జాగ్రత్తగా ఉంటారని.. అలాంటి ఆయన ప్రమాదానికి గురి కావటంపై ఆయన స్నేహితుడు దిగ్భాంత్రిని వ్యక్తం చేశారు.