నందమూరి తారక రామారావు సినీ రంగంలో వెలుగు వెలుగుతున్న సమయంలో హరికృష్ణ కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్టీఆర్ 1967లో నటించిన ‘శ్రీకృష్ణావతారం’ చిత్రంతో హరికృష్ణ బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి చిత్రంలో చిన్న పాత్ర దక్కడంతో పెద్దగా ప్రతిభ చూపే అవకాశం దక్కలేదు. బాల నటుడిగా మళ్లీ మూడు ఏళ్ల తర్వాత ‘తల్లా పెళ్లామా’ అనే చిత్రంలో హరికృష్ణ నటించాడు. ఆ చిత్రంలో హరికృష్ణ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఎన్టీఆర్ కు తగ్గ వారసుడు అంటూ హరికృష్ణను అంతా అభినందించారు.
‘తల్లా పెళ్లామా’ చిత్రంలో హరికృష్ణ పోషించిన పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది. ఆ పాత్రను చాలా సునాయాసంగా పోషించి సినిమాకు హైలైట్ గా నిలిచాడు. ఆ చిత్రంలో చలాకీ కుర్రాడిగా నటించి - విమర్శకు ప్రశంసలు దక్కించుకున్న హరికృష్ణకు ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో బాల నటుడిగా అవకాశాలు వచ్చాయి. కేవలం 13 ఏళ్ల వయస్సులోనే హరికృష్ణ ఒకే ఒక్క సినిమాతో అందరికి తెలిసి పోయాడు. తెలుగులో ఈయనకు అప్పటి స్టార్ డైరెక్టర్స్ నుండి పిలుపు దక్కింది. కాని ఎన్టీఆర్ మాత్రం హరికృష్ణ బాలనటుడిగా నటించేందుకు ఆసక్తి చూపించలేదు.
‘తల్లా పెళ్లామా’ తర్వాత హరికృష్ణ చేసిన చిత్రం తాతమ్మ కల. ఆ చిత్రంలో కూడా ఒక మంచి పాత్రను పోషించిన హరికృష్ణ సినిమా విజయంలో కీలక భాగస్వామి అయ్యాడు. ఇక 20 ఏళ్ల వయస్సులోనే తన తండ్రి ఎన్టీఆర్ తెరకెక్కించిన ‘దాన వీర శూర కర్ణ’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాడు. తండ్రి పర్యవేక్షణలో ఆ చిత్రానికి హరికృష్ణ నిర్మాతగా వ్యవహరించడంతో పాటు - ఆ చిత్రంలో అర్జునుడు పాత్రలో కూడా నటించారు. సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన హరికృష్ణ మరణం ఆయన కుటుంబంతో పాటు, తెలుగు సినిమా పరిశ్రమకు కూడా పెద్ద లోటు అని చెప్పుకోవచ్చు.