ఇప్పుడు డిజె సినిమాకు కొన్ని చోట్ల యావరేజ్ టాక్ వస్తే.. కొన్ని చోట్ల బాగా నెగెటివ్ టాక్ వచ్చింది. కాకపోతే ఓపెనింగ్స్ మాత్రం అల్లు అర్జున్ కెరియర్లోనే బిగ్గెస్ట్ అంటున్నారు. మరి ఇంతేసి వ్యత్యాసం ఎందుకు వచ్చుంది. దీని గురించి అసలు డైరక్టర్ హరీశ్ శంకర్ ఏమంటున్నాడంటే.. రివ్యూలకు రెవెన్యూలకు రేటింగులకూ పెద్దగా సంబంధం లేదు అని చెప్పేస్తున్నాడు.
''రేటింగ్స్ తప్పు కాదు. కొన్ని వెబ్ సైట్లలో రేటింగులు తక్కువగానే ఉన్నాయి. కాని ఇటీవల అదే వెబ్ సైట్లో ఇండస్ర్టీ హిట్ బ్లాక్ బస్టర్ అయిన సినిమాలకు కూడా ఇలా తక్కువ రేటింగులే ఉన్నాయి. ఒక్కరో ఇద్దరో చూసి రివ్యూ రాసి వారిచ్చే రేటింగ్.. అది ప్రపంచం అంతటికీ ఆపాదించకూడదు. రివ్యూ రైటర్లను నేను తప్పుపట్టట్లేదు. కాకపోతే ఎవరి ఒపీనియన్ వారిది'' అంటున్నాడు హరీశ్ వంకర్. ''అసలు రివ్యూలకు రేటింగులకు పెద్దగా పొంతన ఉండట్లేదు. రివ్యూ రైటర్లకు నచ్చకపోయినా జనాలకు సినిమాలు నచ్చుతున్నాయి. ముఖ్యంగా దిల్ రాజు గారి బ్యానర్లో వచ్చిన సినిమాలన్నింటికీ రేటింగులు ఇలా తక్కువగానే వస్తున్నాయి కాని.. రెవెన్యూలు ఎక్కువే వస్తున్నాయి'' అన్నాడు. మరో ఉదాహరణ కూడా ఇచ్చాడులే.
''రివ్యూలు రాసినవారికి శతమానం భవతి నచ్చలేదు. తక్కువ రేటింగులు కూడా ఇచ్చారు. కాని ఆ సినిమా నేషనల్ అవార్డులు ఇచ్చిన జ్యూరీ వారి చెప్పారు. సో ఎవరికి ఏది ఎలా నచ్చుతుంది అనేది మనం చెప్పలేదం. నేను రివ్యూలు రాసేవారిని తప్పుపట్టట్లేదు.. ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఎవరు ఏదైనా రాయచ్చు చెప్పొచ్చు. సోషల్ నెట్వర్కులలో స్వతంత్ర్య ఒపీనియన్ చెప్పుకోవచ్చు'' అంటూ ముగించాడు. కాని డిజె సినిమా అల్లు అర్జున్ కెరియర్లోనే హైయెస్ట్ గ్రాసర్ గా మిగిలిపోతుందని చెప్పేశాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/