ఒక సినిమా ఫలితం దర్శకుడి ఆలోచనలను తర్వాత చేయబోయే ప్రాజెక్ట్స్ మీద ఉంటుందనేది కాదనలేని వాస్తవం. హరీష్ శంకర్ కు ఇది అనుభవమవుతోంది. అల్లు అర్జున్ తో డిజే చేసినప్పుడు దాని మీద వచ్చిన విమర్శలను ఒప్పుకోక రివ్యూల మీద క్రిటిక్స్ మీద కాస్త ఘాటుగానే గుస్సా అయిన హరీష్ శంకర్ దాని తర్వాత కొత్త సినిమాను ఇప్పటి దాకా సెట్స్ పైకి తీసుకెళ్లలేకపోయాడు. దాగుడుమూతలు అనే ఎంటర్ టైనింగ్ స్క్రిప్ట్ తో ఓ మల్టీ స్టారర్ అనుకున్నాడు కాని దాన్ని నిర్మిస్తానన్న దిల్ రాజు ఆ తర్వాత పెద్దగా ఆసక్తి చూపలేదు.
అది ఇకపై కార్యరూపం దాల్చడం అనుమానంగానే ఉంది. దానికి ఇద్దరు హీరోలు కావాలి. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఇద్దరినీ సెట్ చేసుకోవడం తలకు మించిన భారంగా మారింది. అందుకే ఓన్ ప్రొడక్షన్ లో అయినా దాగుడు మూతలు తీద్దామనుకున్న హరీష్ ప్రస్తుతానికి దాన్ని హోల్డ్ లో పెట్టినట్టు టాక్. తాజా అప్ డేట్ ప్రకారం హరీష్ ఓ తమిళ హిట్ ని రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. 2014లో సిద్దార్థ్ హీరోగా జిగర్ తాండా అనే సినిమా వచ్చింది. డిఫరెంట్ థీమ్ తో ప్రేక్షకులను మెప్పించడంతో బ్లాక్ బస్టర్ అందుకుంది. తర్వాత దాన్ని చిక్కడు దొరకడు పేరుతో తెలుగులో డబ్ చేసారు కానీ నేటివిటీ సమస్యతో పాటు పబ్లిసిటీ లోపం వల్ల అది వచ్చిన సంగతి కూడా ఎవరికి తెలియదు. ఆ తర్వాత రెండేళ్లకు కన్నడలో సైతం రీమేక్ చేసుకుని హిట్ కొట్టారు.
ఇప్పుడు దీన్నే తెలుగులో శర్వానంద్ తో కానీ వరుణ్ తేజ్ తో కానీ చేయాలనీ హరీష్ శంకర్ ఆలోచనట. ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ ఒకవేళ ఓకే అయితే మాత్రం తెలుగు వెర్షన్ కు చాలా మార్పులు చేయాల్సి ఉంటుంది. మరి హరీష్ మనసులో దాగుమూతలుతో పాటు ఈ రీమేక్ ఉందా లేక మనసులో ఇంకో మూడో ఆలోచన ఉందా కనీసం ట్విట్టర్ లో అయినా అప్ డేట్ ఇస్తాడేమో వేచి చూడాలి