ఇటీవలే కబీర్ సింగ్ ని చూశారా అన్న ప్రశ్నకు నేను హిట్ అనుకుంటే అది బ్లాక్ బస్టర్ అయ్యింది అయినా నేను చేసిన సినిమాను మళ్ళీ చూడాల్సిన అవసరం లేదన్న తరహాలో విజయ్ దేవరకొండ సమాధానం చెప్పడం కొంత హాట్ టాపిక్ గా మారింది. షాహిద్ కపూర్ గొప్పగా చేయడాన్ని ఒప్పుకోలేక విజయ్ ఇలా చూడనని చెబుతున్నాడని ఏవేవో అర్థాలు తీశారు. నిజానికి ఆలా అనడంలో తప్పేమి లేదు. సందీప్ వంగా బ్రేక్ ఇచ్చిన దర్శకుడు కాబట్టి ఓసారి అతను హిందీలో ఎలా తీసుంటాడు అని ఆసక్తి చూపడంలో పాయింట్ ఉంది కానీ నాకు ఇంటరెస్ట్ లేదు అన్నాక దాన్ని సాగదీయడంలో అర్థం లేదు.
దర్శకుడు హరీష్ శంకర్ అదే అంటున్నారు. విజయ్ చూడను అని చెప్పినంత మాత్రాన ఈర్ష్య అనే పదానికి తావు లేదని ఆ కోణంలో చూడాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పాడు. విజయ్ దేవరకొండతో ప్రస్తుతం సినిమాలు చేస్తున్న దర్శకులే ఈ పాయింట్ గురించి స్పందించలేదు అలాంటిది హరీష్ శంకర్ అదే పనిగా వెనకేసుకురావడం ఏంటబ్బా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏదైనా నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఇలా లైన్ లో పెడుతున్నాడా అనే మాట రాకపోలేదు.
ప్రస్తుతం వరుణ్ తేజ్ తో వాల్మీకిలో బిజీగా ఉన్న హరీష్ శంకర్ దాని తర్వాత ఎవరితో అనే క్లారిటీతో లేడు. గబ్బర్ సింగ్ టైంలో పీక్స్ లో ఉన్న ఇతన్ని రామయ్య వస్తావయ్యా కాస్త కిందకు దించితే డీజే విమర్శలు కూడా తెచ్చిపెట్టింది. అందుకే వాల్మీకిని హిట్ కొట్టే టార్గెట్ తో రూపొందిస్తున్నాడు. సెప్టెంబర్ లో విడుదల కానున్న వాల్మీకి తమిళ్ హిట్ మూవీ జిగర్ తండకు అఫీషియల్ రీమేక్.