అప్పట్లో పవన్ కి ఫ్యాన్ అన్నాడు. ఇప్పుడు చిరంజీవి ఫ్యాన్ అంటున్నాడు. ఏముంది ఇందులో మతలబు? అసలింతకీ ఎవరీయన? ఎందుకిలా మెగా బ్రదర్స్ వెంట పడుతున్నాడు? ఇందులో ఏదైనా ట్విస్టుందా? ఇంటెన్షన్ ఉందా? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే.
ఒకే ఒక్క హిట్ తో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు హరీష్ శంకర్. ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేసినట్టు హరీష్ శంకర్ జీవితాన్ని ఒక్క గబ్బర్ సింగ్ మార్చేసింది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాలతో బిజీ అయిపోయాడు. కానీ ఒకే ఒక్క ఫ్లాపు అతడి జీవితాన్నే మార్చేసింది. ఓవర్ నైట్ కలల సౌధాన్ని కుప్పకూల్చేసింది. ఎన్టీఆర్ తో అతడు తెరకెక్కించిన రామయ్య వస్తావయ్య ఫ్లాపవ్వడంతో హరీష్ ఒక్కసారిగా పెవిలియన్ దారి పట్టాడు. ఏదేమైనా ఇప్పడు మరోసారి మెగా కాంపౌండ్ లో ఛాన్స్ దక్కింది. ఈ ఛాన్స్ ని సద్వినియోగం చేసుకుని మరోసారి మెగా స్టార్ హీరోల వెంట పడాలన్నది అతడి ప్లాన్.
సాయిధరమ్ తేజ్ హీరోగా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న హరీష్ శంకర్ ఆడియో ఈవెంట్ లో ఓ తమాషా మాట అన్నాడు. నేను మెగాస్టార్ చిరంజీవి అభిమానిని అని అన్నాడు. మరి అప్పట్లో గబ్బర్ సింగ్ టైమ్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి ఫ్యాన్ అన్నావు కదా! అని అంటే .. లక్ష్మణుడి ఫ్యాన్ అంటే ఆటోమెటిగ్గా రాముడి ఫ్యాన్ అనే కదా అర్థం. కాదా? అని నవ్వేశాడు హరీష్ శంకర్. హరీష్ నవ్వేస్తూ అన్నా, మాట వరసకే అన్నా.. లేదా ఇంకేదైనా ఇంటెన్షన్ తో అన్నా అతడు మెగాస్టార్ చిరంజీవితో సినిమాపై కన్నేశాడని అర్థమవుతోంది.
ఓ వైపు పవన్ ని దువ్వేస్తూనే, మరోవైపు చిరుకి లైనేస్తున్నాడు. ఎలానూ సాయిధరమ్ కి హిట్టిస్తానన్న కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మెగా హీరోలతో ఛాన్స్ పట్టేయాలన్నది ఆలోచన. ఇప్పటికైతే హరీష్ పవర్ ఫుల్ మెగా ఫ్యాన్. అయితే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ రిజల్ట్ అతగాడి ఫేట్ ని నిర్ణయిస్తుంది. ఇప్పుడర్థమైందా? అసలు సంగతి.