ఆమెను ఆంటీ అని కాకపోతే ఏమనాలో

Update: 2016-07-19 17:30 GMT
ఓ మూడు రోజుల క్రితం బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ పుట్టిన రోజు జరుపుకుంది. ఇంకా క్లియర్ గా చెప్పుకుంటే జూలై 16తో కేట్ కు 33 ఏళ్లు నిండిపోయాయి. ఈ సందర్భంగా ఓ చిన్నారి బర్త్ డే విషెస్ చెబుతూ ఆంటీ అని పిలిచింది.

ఆ పాప ఎవరో కాదు.. భజరంగీ భాయిజాన్ మూవీలో సల్మాన్ తో పాటు కనిపించిన చిన్నారి హర్షాలి మల్హోత్రా. సినిమాలో మున్నీ పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం సంగతేమో కానీ.. 'హ్యాపీ బర్త్ డే కత్రినా కైఫ్ ఆంటీ'  అంటూ ఆ 8 ఏళ్ళ పసిపిల్ల ట్వీట్ చేయడం పెద్ద నేరం అయిపోయింది. కత్రినాని అక్కా అనకుండా ఆంటీ అంటుందా అంటూ తిట్టిపోసేశారు చాలామంది అభిమానులు. మరికొందరైతే ఆమె నోరు పడిపోవాలని కూడా శాపాలు పెట్టేశారు. కత్రినా కైఫ్ మాత్రం ఈ ఇన్సిడెంట్ పై పాజిటివ్ గానే స్పందించి 'థాంక్యూ లవ్' అంటూ కామెంట్ పెట్టింది.

ఇక్కడ ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్ల రియాక్షన్ నే గురించే మాట్లాడుకోవాలి. 33 ఏళ్ల యువతిని అంత చిన్నారి ఆంటీ పిలిస్తే తప్పేంటో అర్ధం కాని విషయం. తమ అభిమాన నటి అయినంత మాత్రాన.. కేవలం ఆంటీ అని పిలిచినందుకే అంతలేసి శాపాలు పెట్టడం అవసరమా? వీళ్ల శాపాలేవో తగిలేస్తాయని కాదు కానీ.. అభిమానంతో మరీ ఇంత దారుణంగా ప్రవర్తించడం సరి కాదు కదా.
Tags:    

Similar News