నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం షూటింగ్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. 'ఎన్టీఆర్ మహానాయకుడు' టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి మూడో వారంలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత బాలయ్య చేయబోయే నెక్స్ట్ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిలిం సర్కిల్స్ లో హల్చల్ చేస్తోంది.
బాలయ్య తన నెక్స్ట్ సినిమాను బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. బాలయ్య-బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన 'సింహా'.. 'లెజెండ్' సినిమాలు రెండూ సూపర్ హిట్స్ అయ్యాయి. దీంతో వీరి కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ చిత్రం హ్యాట్రిక్ కానుంది. 'సింహా'.. 'లెజెండ్' సినిమాల్లో బాలయ్య కోసం పవర్ఫుల్ పాత్రలు డిజైన్ చేసిన బోయపాటి ఈ సారి కూడా పవర్ఫుల్ క్యారెక్టర్లు డిజైన్ చేశాడట. ఈ సినిమాలో బాలయ్య డబల్ రోల్ లో కనిపిస్తారని అందులో ఒక పాత్ర ముఖ్యమంత్రిగా ఉంటుందని సమాచారం.
'ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమాలో 'అన్నగారి' పాత్రలో బాలయ్య ముఖ్యమంత్రిగా కనిపిస్తాడు. ఇప్పుడు బోయపాటి సినిమాలో కూడా ముఖ్యమంత్రి క్యారెక్టర్ అంటే బ్యాక్ టూ బ్యాక్ సీఎమ్ రోల్స్ అన్నమాట. ప్రీ ప్రొడక్షన్ జోరుగా సాగుతున్న ఈ సినిమాను ఫిబ్రవరి చివరి వారంలో లాంచ్ చేస్తారని సమాచారం.