సూపర్ స్టార్ మహేష్ పాన్ ఇండియా మూవీ ముహూర్తం డేట్ ఫిక్సైందా? దర్శక శిఖరం-రచనా దిగ్గజం రాజమౌళి-విజయేంద్ర ప్రసాద్ సరైన తేదీని లాక్ చేసారా? ముహూర్తం విషయంలో రెండు నెలల్లో మంచి తేదీల్ని లాక్ చేసే ప్లాన్ లో ఉన్నారా ? అంటే అవుననే లీకులందుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే...ఇప్పటికే మహేష్-రాజమౌళి ప్రాజెక్ట్ కన్పమ్ అయింది.
ఆప్రికన్ అడవుల నేపథ్యంలో సాగే చిత్రమిది. ఎస్ ఎస్ ఎంబీ 28వ చిత్రం పూర్తికాగానే 29వ చిత్రంగా రాజమౌళి సినిమా పట్టాలెక్కనుంది. అయితే ఇది వచ్చే డాది మిడ్ లో ప్రారంభం అవుతుందని ఇంత వరకూ ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. అయితే ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని అంతకు ముందు ప్రారంభించాలని జక్కన్న ద్వయం భావిస్తున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో గుస గుస మొదలైంది.
ఇదే ఏడాది డిసెంబర్ నెలాఖరున లేదా? ఫిబ్రవరిలో సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభిస్తే బాగుంటుందని ప్లాన్ చేస్తున్నారుట. ఆ తర్వాత రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలు పెట్టినా ఇబ్బంది ఉండదని జ్యోతిష్యులు సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో డిసెంబర్ లేదా ఫిబ్రవరిలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఫిలిం సర్కిల్స్ లో గుసగుస మొదలైంది.
జనవరిలో లాంచ్ చేయాలని ముందుగా భావించినా ఆనెలంతా పుష్యం కొనసాగుతుంది. మంచి రోజులు కావు. కాబట్టి రాజమౌళి ఛాయిస్ గా డిసెంబర్..ఫిబ్రవరి నెలలు కనిపిస్తున్నాయి. అవి తప్పితే మార్చి లో కొన్ని రోజులున్నాయి. ఆ తర్వాత సమ్మర్ మొదలైతే! మంచి రోజులు కష్టమని పండితుల సలహాగా తెలుస్తోంది. అయితే ఇలాంటి వాటిని విజయేంద్ర ప్రసాద్ పెద్ద సెంటిమెంట్ గా భావించరు.
మహేష్..రాజమౌళి మాత్రం గొప్ప భక్తులు. కాబట్టి ఎలా ముందుకెళ్లారు? అన్నది చూడాలి. సినిమా ప్రారంభమైన నాటి నుంచి షూటింగ్ ఏకధాటిగా జరగాల్సిందే. పూర్తవ్వడానికి ఎన్ని రోజులు పడుతుందన్నది క్లారిటీ ఉండదు. షూట్ ని బట్టి జక్కన్న రిలీజ్ తేదీని డిసైడ్ చేస్తారు. అంత వరకూ రిలీజ్ ఎప్పుడన్నది చెప్పలేం.
ప్రస్తుతం ఈ యాక్షన్ అడ్వెంచర్ కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. మహేష్ ఈ విషయాలేవి పట్టించుకోలేదు. ఆయన తన 28వ సినిమా పనుల్లోనే బిజీ అయ్యే ప్లాన్ లో ఉన్నారు. త్రివిక్రమ్ ఈ వారంలోనే షూటింగ్ ప్రారంభించే బిజీలో ఉన్నారు. ఈ సినిమా చిత్రీకరణ సహా అన్ని పనులు పూర్తిచేసి వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.