జనసేన పార్టీకి తన వంతుగా పాతిక లక్షలు ఇచ్చాడు నాగబాబు. అంతేకాదు కొడుకు వరుణ్ తేజ్‌తో కోటి రూపాయలు విరాళం ఇప్పించాడు. మొత్తంగా కేవలం నాగబాబు ఫ్యామిలీయే దాదాపు కోటిన్నర విరాళం జనసేనకు ఇచ్చింది. పార్టీ బలోపేతం కోసం పవన్ కల్యాణ్ విరాళాలు సేకరిస్తున్నాడు. ఇందులో భాగంగా నాగబాబు ఇంత పెద్ద మొత్తం ఒకేసారి ఇవ్వడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇందులో పెద్ద ఆశ్చర్యం ఏం లేదని.. నాగబాబు పవన్ కల్యాణ్ రుణం తీర్చుకున్నాడని అనేవాళ్లు ఉన్నారు.
ఆరంజ్ సినిమా ఫ్లాప్ తో నాగబాబు తన ఆస్తులన్నీ పోగొట్టుకున్నాడు. దాదాపుగా ఆరంజ్ సినిమాతో రోడ్డుమీదకు వచ్చేశాడు. ఆ సమయంలో.. నా అనుకున్న వాళ్లు ఎవ్వరూ నాగబాబుకు సాయం చేయలేదు. అలాంటి టైమ్ లో తన అన్నకోసం పవన్ కల్యాణ్ రంగంలోకి దిగాడు. చాలా వరకు ఆస్తులు అమ్మి నాగబాబు అప్పుల్ని తీర్చాడు. అయితే… ఈ విషయం అధికారికంగా బయటకు రాకపోయినా.. ఇండస్ట్రీలో ఎక్కువమంది ఇది నిజమనే చెప్తారు. అందుకే ఆ కృతజ్ఞతగా.. ఇప్పుడు తనవంతు సాయం నాగబాబు ఫ్యామిలీ చేసిందని చెప్తున్నారు. మరోవైపు.. ఇంకొన్ని రోజుల్లో నాగబాబు జనసేనలో చేరడం ఖాయమని అనేవాళ్లు లేకపోలేదు. మరి నాగబాబు జనసేనలో చేరతారో.. లేదంటే బయటనుంచి మద్దతు ఇస్తారో తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.