చరణ్ అంత రిచ్చా

Update: 2019-02-03 10:53 GMT
వినయ విధేయ రామ డిజాస్టర్ అయినప్పటికీ రామ్ చరణ్ కు వచ్చిన డ్యామేజ్ ఏమి లేదు కాని రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రావాల్సిన సినిమా కాదని అభిమానులు తెగ బాధపడ్డారు. ఇదలా ఉంచితే రామ్ చరణ్ ఇటీవలే జూబ్లీ హిల్స్ లో తన టేస్ట్ కు అనుగుణంగా కొత్త ఇంటిని నిర్మించుకున్నాడు. అందులో ఆశ్చర్యం లేదు కాని దాని కైన ఖరీదు ఇప్పుడు టాక్ అఫ్ ది సౌత్ గా మారింది. దీని నిర్మాణానికి అక్షరాల 38 కోట్ల దాకా ఖర్చయ్యిందట. ఇంత భారీ బడ్జెట్ తో కట్టిన సెలబ్రిటీ ఇళ్ళు దక్షిణాది రాష్ట్రాల్లో చాలా తక్కువ. అందుకే చరణ్ గృహం చాలా స్పెషల్ గా నిలుస్తోంది.

ఒక జాతీయ ఛానల్ కథనం ప్రకారం చరణ్ కు సుమారుగా 1300 కోట్ల ఆస్తులు ఉన్నాయని లెక్క తేలిందట. స్వతహాగా చిరంజీవి ఒకేఒక్క వారసుడిగా ఆయన సంపద చెర్రికే చెందటంతో పాటు హీరోగా తాను చేసిన సినిమాల ద్వారా సంపాదించుకున్న మొత్తం అంతా కలిపి లెక్క అలా ఎగబాకిందన్న మాట. అయితే ఇక్కడ ఇంకో విషయం ఉంది. ఉపాసనతో వివాహం అయ్యాక చరణ్ పేరిట అపోలో గ్రూప్ కు సంబంధించిన సుమారు 700 కోట్ల ఆస్తులు వచ్చాయనే ప్రచారం కూడా ఉంది.

అయితే ఇది నిజమో కాదో అధికారిక ధృవీకరణ లేదు. చరణ్ ఇలా కెరీర్ పరంగా సంపద పరంగా చాలా హై రేంజ్ లో దూసుకుపోతున్నాడు. రాజమౌళి మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ కోసం పారితోషికం బదులు లాభాల్లో షేర్ అడిగినట్టుగా ఇప్పటికే వార్తలు ఉన్నాయి. అదే నిజమైతే ఆ ఫిగర్ ఊహకకు అందటం కష్టమే. సంక్రాంతి సినిమా నిరాశపరిచినా రామ్ చరణ్ ని మళ్ళి తెరమీద చూడాలి అంటే కనీసం ఏడాదికి పైగానే వెయిట్ చేయాలి. జక్కన్న సినిమా కాబట్టి టైం మనం ఊహించినట్టు ఉండదు


Tags:    

Similar News