ఆ డైరెక్ట‌ర్ చ‌ర‌ణ్ నుంచి రౌడీకి షిఫ్ట్ అయ్యాడా?

Update: 2022-11-18 05:29 GMT
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో సినిమాకు రెడీ అయిన క‌న్న‌డ డైరెక్ట‌ర్ రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ వైపు మ‌ళ్లాడా? అంటే తాజా ప‌రిణామాలు అవున‌నే స‌మాధానం చెబుతున్నాయి. వివ‌రాల్లోకి వెళితే.. ప్ర‌స్తుతం 'కేజీఎఫ్‌' త‌రువాత దేశ వ్యాప్తంగా ఏ నోట విన్నా వినిపిస్తున్న పేరు క‌న్న‌డ సినిమా. వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ ల‌తో పాన్ ఇండియా వండ‌ర్ ల‌తో క‌న్న‌డ ఇండ‌స్ట్రీ దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. క‌న్న‌డ ఇండస్ట్రీ నుంచి వ‌స్తున్న సినిమాలు ఆలోచింప జేస్తూనే ఆక‌ట్టుకుంటున్నాయి.

దీంతో ప్రేక్ష‌కులు నేటీవిటీతో సంబంధం లేకుండా క‌న్న‌డ అనువాద చిత్రాల‌కు దేశ వ్యాప్తంగా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతూ బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపిస్తున్నారు. 'కేజీఎఫ్‌' సిరీస్ సినిమాల నుంచి 'కాంతార‌' వ‌ర‌కు క‌న్న‌డ నుంచి విడుద‌లైన ప్ర‌తీ సినిమా దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నాలు సృష్టిస్తుండ‌టంతో ప్ర‌తీ ఒక్క‌రి దృష్టి క‌న్న‌డ ఇండ‌స్ట్రీపై ప‌డింది. అంతే కాకుండా స్టార్ హీరోలు కూడా క‌న్న‌డ డైరెక్ట‌ర్ల‌లో క‌లిసి సినిమాలు చేస్తున్నారు.

ఇప్ప‌టికే ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్ లో ప్ర‌భాస్ 'స‌లార్‌' మూవీలో న‌టిస్తుండ‌గా త్వ‌ర‌లో ఎన్టీఆర్ కూడా ఓ భారీ పాన్ ఇండియా మూవీని ప్ర‌శాంత్ నీల్ తో చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఈ జాబితాలో రామ్ చ‌ర‌ణ్ కూడా చేర‌బోతున్నార‌ని, క‌న్న‌డ ద‌ర్శ‌కుడు న‌ర్త‌న్ డైరెక్ష‌న్ లో ఓ భారీ సినిమాకు శ్రీ‌కారం చుట్ట‌బోతున్నార‌ని వ‌రుస క‌థ‌నాలు వినిపించాయి. అయితే తాజా వార్త‌ల ప్ర‌కారం న‌ర్త‌న్ డైరెక్ష‌న్ లో రామ్ చ‌రణ్ కాకుండా రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది.

ఇటీవ‌ల క‌న్న‌డ‌లో శివ‌రాజ్ కుమార్‌, శ్రీ‌ముర‌ళిల కాంబినేష‌న్ న‌ర్త‌న్ చేసిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ 'ముఫ్తీ'. ఈ మూవీతో అక్క‌డ స్టార్ డైరెక్ట‌ర్ గా పేరు తెచ్చుకున్న న‌ర్త‌న్ ఇటీవ‌లే హీరో రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు క‌థ వినిపించార‌ని, స్టోరీ న‌చ్చ‌డంతో విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా త‌న‌క గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ 'ఖుషీ' మూవీలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

స‌మంత కార‌ణంగా రెగ్యుల‌ర్ షూటింగ్ ఆల‌స్యం అవుతూ వ‌స్తున్న ఈ మూవీ త‌రువాత విజ‌య్ దేవ‌ర‌కొండ 'జెర్సీ' ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి డైరెక్ష‌న్ లో ఓ భారీ మూవీ చేయ‌బోత‌న్నాడ‌ని వ‌రుస క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. దిల్ రాజు నిర్మించ‌నున్న ఈ మూవీకి సంబంధించిన అఫీయ‌ల్ అనౌన్స్ మ ఎంట్ త్వ‌ర‌లో రానుంది. ఈ మూవీ త‌రువాతే విజ‌య్ తో న‌ర్త‌న్ సినిమా వుంట‌నుంద‌ని చెబుతున్నారు. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ రానుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News