వేగంగా సినిమాలు తీస్తే క్వాలిటీ దెబ్బ తింటుందన్న అభిప్రాయాన్ని మార్చిన టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ పేరు ముందు చెప్పుకోవాలి. దేశ విదేశాల్లో చిత్రీకరణ జరుుకున్న ‘కంచె’ చిత్రాన్ని అతను నాలుగు నెలల్లోనే పూర్తిచేశాడు. ఆ సినిమా స్కేల్ ప్రకారం చూస్తే అది మామూలు స్పీడ్ కాదు. సినిమా లో క్వాలిటీ చూసి ఇంత వేగంగా ఇలాంటి చిత్రం ఎలా తీశాడో అని అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో ఇంకా పెద్ద సాహసమే చేశాడు క్రిష్. ఈ చిత్రాన్ని 79 రోజుల్లో ముగించాడు. ఇందులో కూడా క్వాలిటీ ఏమీ మిస్ కాలేదు. ప్రపంచ స్థాయి టెక్నికల్ వాల్యూస్ కనిపిస్తాయి ఆ సినిమా లో. పై రెండు చిత్రాల్లో నూ కథా కథనాలు ఉన్నతంగా ఉంటాయి. మరిప్పుడు ‘యన్.టి.ఆర్’ విషయంలో ఈ మ్యాజిక్ పునరావృతం చేశాడా అన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది.
‘యన్.టి.ఆర్’ మొదలై ఐదు నెలలే అయింది. పైగా ఈ చిత్రాన్ని రెండు భాగాలు గా తీయాలని మధ్య లో నిర్ణయించుకున్నారు. తొలి భాగాన్ని సంక్రాంతి కే రిలీజ్ చేయబోతున్నారు. దాని కి సంబంధించి షూటింగ్ పూర్తి చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ కూడా మొదలపెట్టేసిన క్రిష్.. మరో వైపు రెండో భాగం షూటింగ్ కూడా ముగించే పని లో పడ్డాడట. రేయింబవళ్లు అతను కష్టపడుతున్నాడట. ఐతే ‘కంచె’.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాల విషయంలో కంటెంట్ చాలా బలమైంది. మంచి కథ రాసుకున్నాడు. తనే స్క్రీన్ ప్లే సమకూర్చుకున్నాడు. అన్నీ అతడి చేతిలో నే జరిగాయి. తన టాలెంట్ పూర్తి గా వాటి లో చూపించాడు. స్క్రిప్టు పై పూర్తి పట్టు తో ఆ చిత్రాల్ని శరవేగంగా తీశాడు.
కానీ ‘యన్.టి.ఆర్’ విషయంలో వేగం చూపించాడు సరే కానీ.. క్వాలిటీ మాటేంటి అనేది సందేహంగా మారింది. ఈ చిత్రాని కి స్క్రిప్టు క్రిష్ రాయలేదు. సినిమా లో ఏం ఉండాలి.. ఏది ఎలా ఉండాలి అన్నది కూడా క్రిష్ నిర్ణయించలేదు. ఇప్పటి దాకా రిలీజ్ చేసిన పోస్టర్లు అవీ చూస్తే.. ఇందులో ఏమైనా తెలియని విషయాలు.. చెప్పుకో దగ్గ కథా కథనాలు ఉంటాయా అన్నదే డౌట్ గా ఉంది. బాలయ్యతో రకరకాల వేషాలు వేయించి.. ఎన్టీఆర్ నటించిన సినిమాల్లోని సీన్లు.. పాటలు పేర్చేశారేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇందులో అసలు చెప్పుకోదగ్గ కథ ఉంటుందా.. క్రిష్ తన ప్రత్యేకతను చాటుకునే అవకాశముంటుందా అన్నది ముందు నుంచి సందేహాలు కలుగుతుండగా.. రిలీజ్ దగ్గర పడే కొద్దీ అవి మరింత పెరుగుతున్నాయి.