పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్లాన్ మొత్తం మార్చేశాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో నటిస్తూ క్షణం తీరికలేకుండా ఊపిరి సలపని బిజీ షెడ్యూల్ తో సినిమాలు చేస్తున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం నాలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ రూపొందిస్తున్న మైథలాజికల్ డ్రామా `ఆది పురుష్` చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అయిపోయింది.
ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ మూవీని 2023 జనవరి 12న భారీ స్థాయిలో ఐదు భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే టీజర్ గ్రాఫిక్స్.. ప్రభాస్ లుక్ తో పాటు ఇతర పాత్రల మేకోవర్ పై నెట్టింట దారుణంగా ట్రోల్స్ రావడంతో వీఎఫ్ ఎక్స్ రీ వర్క్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఇందు కోసం ఏకంగా బడ్జెట్ కు మించి మరో రూ. 100 కోట్లు కేటాయించి వీఎఫ్ ఎక్స్ వర్క్ మొదలు పెట్టారు. జూన్ 16న రిలీజ్ చేస్తామంటూ ప్రకటించారు.
అయితే తాజా పరిస్థితులు, వీఎఫ్ ఎక్స్ వర్క్ కారణంగా ఈ మూవీ రిలీజ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ రిలీజ్ ని 2024 సంక్రాంతికి మార్చి నట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని దర్శకుడు ఓం రౌత్ ఇటీవల హీరో ప్రభాస్ కు స్పష్టం చేశాడట. దీంతో ప్రభాస్ కూడా ఈ మూవీ విషయంలో తన ప్లాన్ మార్చుకున్నట్టుగా చెబుతున్నారు.
ఇక ఈ మూవీతో పాటు ప్రభాస్ `సలార్` మూవీలో నటిస్తున్నాడు. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా 2023 సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. ఈ రిలీజ్ డేట్ లో మాత్రం ఎలాంటి మార్పు లేదట.
ఇక నాగ్ అశ్విన్ తో టైమ్ ట్రావెల్ కథతో `ప్రాజెక్ట్ కె` ని చేస్తున్నాడు. ఈ మూవీ 2024 సమ్మర్ కే రానుందని చెబుతున్నారు. వీటితో పాటు ప్రభాస్ రీసెంట్ గా ఫ్యాన్స్ వద్దని వారిస్తున్నా మారుతి సినిమాని పట్టాలెక్కించాడు. దీని రిలీజ్ ఇప్పట్లో తేలడం కష్టం. ఎందుకంటే సినిమా షూటింగ్ దశలో వుంది. పూర్తయితే కానీ రిలీజ్ డేట్ ని ప్రకటించలేరట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.