క్రేజీగా క‌లిసి న‌టిస్తున్న అక్క చెల్లెళ్లు

Update: 2020-07-13 07:50 GMT
టాలీవుడ్ లో అగ్ర క‌థానాయిక‌గా ఎదిగాక‌ శ్రుతిహాస‌న్ డేర్ డెసిష‌న్స్ అంద‌రినీ షాక్ కి గురి చేసిన సంగ‌తి తెలిసిందే. విదేశీ బోయ్ ఫ్రెండ్ మేఖేల్ కోర్స‌లేని పెళ్లాడి సెటిలైపోతుంద‌ని భావిస్తే ఆశించిన‌ది జ‌ర‌గ‌లేదు. ఊహించ‌ని బ్రేక‌ప్ త‌ర్వాత తిరిగి కెరీర్ కంబ్యాక్ కోసం శ్రుతి సీరియ‌స్ గానే ట్రై చేస్తోంది. ఇక శ్రుతిహాస‌న్ కెరీర్ ఇలా ఉంటే త‌న గారాల చెల్లెలు అక్ష‌ర హాస‌న్ కెరీర్ ఇప్ప‌టివ‌ర‌కూ టేకాఫ్ కాక‌పోవ‌డం క‌మ‌ల్ హాస‌న్ లో ఆందోళ‌న పెంచుతున్న సంగ‌తి తెలిసిందే.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క‌సారి కూడా క‌లిసి న‌టించ‌ని శృతి హాసన్- అక్ష‌ర్ హాసన్ ఒకే ఫ్రేమ్ లో క‌నిపించి అభిమానుల‌కు క‌న్నుల పండుగ చేయ‌నున్నార‌ట‌. అది కూడా హాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `డోంట్ బ్రీత్` రీమేక్ లో న‌టించేందుకు రెడీ అవుతున్నారని తెలిసింది. ఈ సినిమాలో చియాన్ విక్ర‌మ్ కూడా కీల‌క పాత్ర పోషిస్తున్నాడు.

డోంట్ బ్రీత్ ని త‌మిళంలో రీమేక్ కానుంది. బ‌హుశా తెలుగు లోనూ రిలీజ‌య్యే ఛాన్సుంది. ఓ అంధుడైన‌ ఆర్మీ మేజ‌ర్ ఇంట్లో దొంగ‌త‌న‌నాకి ట్రై చేసి ముప్పు తిప్ప‌లు ప‌డే ముగ్గురు టీనేజ్ దొంగ‌ల క‌థ ఇది. అవ‌తార్ చిత్రంలో విల‌న్ గా క‌నిపించిన స్టీఫెన్ లాంగ్ హాలీవుడ్ మూవీలో ఆర్మీ మేజ‌ర్ గా న‌టించారు. జేన్ లెవీ- డేనియ‌ల్ జొవాటో-డైలాన్ మినెట్టే త‌దిత‌రులు టీనేజీ దొంగ‌లుగా న‌టించారు. త‌మిళ రీమేక్ లో స్టీఫెన్ పోషించిన ఆర్మీ మేజ‌ర్ పాత్ర‌లో చియాన్ విక్ర‌మ్ న‌టిస్తారు. ఇక జేన్ న‌టించిన ఫీమేల్ దొంగ పాత్ర‌లో శ్రుతిహాస‌న్ న‌టిస్తుంది. అయితే అక్ష‌ర హాస‌న్ పాత్ర ఇందులో అతిథి పాత్ర మాత్ర‌మేనా లేక ఎన్ లార్జ్ చేసి ఫుల్ లెంగ్త్ లో చూపిస్తారా? అన్న‌ది చూడాలి. ఆర్మీ మేజ‌ర్ ఇంట్లో కిడ్నాప్ కి గురైన యువ‌తి పాత్ర‌ను అక్ష‌ర పోషించే వీలుంద‌ని భావిస్తున్నారు.
Tags:    

Similar News