రణబీర్‌-కత్రినా.. అఫీషియల్‌గా విడిపోయారట

Update: 2016-01-16 06:49 GMT
అనుకున్నట్లే జరిగింది. ఈ మధ్యనే తప మాజీ ప్రియురాలు దీపికా పదుకొనెతో 'తమాషా' సినిమా చేశాడు రణబీర్‌ కపూర్‌. ఏకంగా పెదాలను పెనవేసుకొని నాలుకను జుర్రేసే రేంజులో లిప్‌ కిస్‌ ఒకటి పెట్టేశాడు. ఫైనల్‌ మీవీలో ఆ కిస్సును అర నిమిషం పెట్టారు కాని.. ఒరిజినల్‌ గా ఐదు నిమిషాలు తీశారట. ఈ విషయం గురించి మన హీరో ప్రస్తుత ప్రియురాలిని అడిగితే.. వాళ్లకి బుద్దుండాలి ఎవరైనా ఫీలవుతారేమోనని.. మనం ఏం చేస్తాం.. అనేసింది.

కట్‌ చేస్తే.. రణబీర్‌ ఫ్రెండు ఆదిత్య కపూర్‌ తో 'ఫితూర్‌' సినిమా చేస్తోంది కత్రినా. ఈ సినిమా కోసం కత్తిలాంటి అందాలతో బీభత్సంగా రెచ్చిపోయింది. కేవలం రణబీర్‌ మీద కచ్చితో ఈ రేంజులో రెచ్చిపోయిందని ఇట్టే అర్ధమైపోతోంది. ఇంతకీ ఇప్పుడు ఈ హరికథ అంతా ఎందుకంటే.. రణబీర్‌ కత్రినాలు విడిపోయారని తెలుస్తోంది. మొన్నే క్రిస్మస్‌ పార్టీలో ఎంటైర్‌ కపూర్‌ కాందాన్‌ తో కలసి కత్రినా పార్టీ చేసుకున్నప్పటికీ.. తాము ఇద్దరూ కలసి ఉంటున్న ఫ్లాట్‌ లో నుండి రణబీర్‌ ఖాళీ చేసేశాడు. తన పేరెంట్స్‌ తో కలసి పాత ఇంట్లో ఉంటున్నాడు. కత్రినా మాత్రం ఇంకా అదే ఫ్లాట్‌ లో కంటిన్యూ అవుతోంది.

ఈ విషయాన్ని బాలీవుడ్‌ కు చెందిన ఒక అతి పెద్ద ఫిలిం జర్నలిస్టు కన్‌ ఫామ్‌ చేశారు.
Tags:    

Similar News