యువహీరో నితిన్ ప్రస్తుతం రంగ్ దే సినిమాను విడుదలకు సిద్ధం చేసాడు. మార్చ్ 26న రంగ్ దే థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రంగ్ దే మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్స్, లిరికల్ సాంగ్స్ సినిమా పై మంచి బజ్ క్రియేట్ చేసాయి. వచ్చేవారం సినిమా విడుదల కాబోతుండటంతో రంగ్ దే సినిమాకు సంబంధించి పలు విషయాలను లిరిక్ రైటర్ శ్రీమణి బయటపెట్టాడు. రంగ్ దే సినిమాలోని అన్ని పాటలకు శ్రీమణినే లిరిక్స్ అందించాడు. మరి ఎలా రంగ్ దే ప్రయాణం జరిగింది అనేది ఆయన మాటల్లోనే వివరించాడు. ప్రస్తుతం శ్రీమణికి యువతలో మంచి క్రేజ్ ఉంది. క్యాచి లిరిక్స్ రాయడంలో శ్రీమణి సిద్ధహస్తుడు అనిపించుకున్నాడు. అయితే రంగ్ దే సినిమా విషయానికి వస్తే.. డైరెక్టర్ వెంకీ అట్లూరి మొదటి సినిమా నుండి లిరిక్స్ రాస్తున్నాడు శ్రీమణి.
ఈ సినిమాలోని పాటలన్ని తానే రాయడానికి కారణం దర్శకుడే అని చెప్పాడు. నా మీద నమ్మకంతో అన్ని పాటలు నాతోనే రాయించుకున్నాడు. మా ఇద్దరికీ మొదటి నుండి మంచి బాండింగ్ ఏర్పడింది. అందువల్లే ఈ రంగ్ దే సాంగ్స్ అన్ని బాగా కుదిరాయని తెలిపాడు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో శ్రీమణి ఎన్నో పాటలు రాసాడు. 100% లవ్ మూవీ నుండి ఇప్పటివరకు వీరి కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్స్ వచ్చాయి. దేవి గురించి మాట్లాడుతూ.. దేవికి నాకు మధ్య ఫ్రీక్వెన్సీ బాగా కనెక్ట్ అయింది. అందుకే మ్యూజిక్ తగ్గట్టుగా క్యాచి పదాలు కుదిరాయి అంటూ సెలవిచ్చాడు. ప్రస్తుతం రంగ్ దే పాటలు మంచి హిట్ అయ్యాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నితిన్ సరసన కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. చూడాలి మరి రంగ్ దే రిజల్ట్స్ ఎలా ఉండబోతుందో!