రియల్ లైఫ్ లో ఆ టైం లేదట

Update: 2016-12-11 07:04 GMT
పెద్ద నోట్ల రద్దు దెబ్బకు సినిమా రిలీజ్ డేట్లు అటూ ఇటూ అయిపోతున్న సంగతి చూస్తూనే ఉన్నాం. చాలా సినిమాలు పోస్ట్ పోన్ అవుతుంటే.. ప్రీపోన్ అయిపోయి ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్న సినిమా 'నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్'.

కుమారి 21ఎఫ్, ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా అంటూ వరుసగా మూడు హిట్స్ కొట్టిన హేభా పటేల్.. తండ్రి ప్రేమకు- ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ తో ఎఫైర్లకు మధ్య నడిపించే స్టోరీనే ఈ సినిమా. తండ్రీ కూతుళ్ల మధ్య జరిగే స్టోరీ నచ్చడంతోనే ఈ సినిమా చేశానంటున్న హేభా పటేల్ కి.. రియల్ లైఫ్ లో మాత్రం ఒకందుకు టైం లేదట. అసలు దొరకడం లేదట. సినిమాలో అంటే ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ ను వెంట తిప్పుకున్నా.. రియల్ లైఫ్ లో మాత్రం బాయ్ ఫ్రెండ్స్ తో తిరిగేందుకు టైం లేదు అంటోందీ కుమారి.

ఈ మూవీలో తన పేరు పద్మావతి.. పల్లెటూరిలో తండ్రి పెంపకంలో అల్లారు ముద్దుగా పెరిగిన తనపాత్రకు.. సిటీలో ఓ ఫ్రెండ్ దొరుకుతుంది. ఈ పద్మావతి సిటికీ వచ్చాక ఓ తప్పు చేస్తే.. ఆ తప్పును సరిదిద్దేందుకు తండ్రి పాత్రలో చేసిన రావు రమేష్ ఏం చేశాడన్నదే ఈ మూవీ అంటోంది హేభా పటేల్. గతంలో వినాయక్ దగ్గర పని చేసిన దర్శకుడు భాస్కర్ బండి.. నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ ను ఎంతో పరిణతితో తెరకెక్కించాడని చెప్పిన హేభా.. దిల్ రాజు రిలీజ్ చేయనుండడంతో సినిమాకు మరింత వాల్యూ పెరిగిందని అంటోంది.
Tags:    

Similar News