బాగా డబ్బు సంపాదించాలంటున్న హెబ్బా

Update: 2017-05-03 10:29 GMT
సినిమా వాళ్ల దగ్గర డబ్బుల సంగతి ప్రస్తావిస్తే.. లైట్ అన్నట్లు మాట్లాడతారు. డబ్బు ముఖ్యం కాదు.. పాత్రలు ముఖ్యం.. మంచి పేరు సంపాదించడం ముఖ్యం అంటూ నీతి వాక్యాలు వలిస్తుంటారు. ఐతే హెబ్బా పటేల్ మాత్రం ఇలాంటి హిపోక్రటిక్ కబుర్లు చెప్పట్లేదు. తనకు డబ్బు చాలా ముఖ్యమని.. బాగా సంపాదించాలనే సినిమాల్లో కొనసాగుతున్నానని అందామె. తన తల్లిదండ్రులకు సొంత ఇల్లు కొనివ్వాలన్నది తన కల అని.. అందుకోసం బాగా డబ్బు సంపాదించాలని ఆమె అంది. తన తల్లిదండ్రులకు ముంబయిలో ఇల్లు కొనివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నానని.. ఐతే అక్కడ ధరలు విపరీతంగా ఉండటంతో ఇప్పుడు మనసు మార్చుకుని.. హైదరాబాద్‌ లో ఇల్లు కొనివ్వాలన్న లక్ష్యంతో పని చేస్తున్నట్లు హెబ్బా చెప్పింది.

ఇక వరుస విజయాల తర్వాత రెమ్యూనరేషన్ బాగా పెంచేసినట్లు వస్తున్న వార్తలపై హెబ్బా స్పందిస్తూ.. ‘‘ఇంతకీ ఇప్పుడు నా పారితోషకం ఎంతో ఒకసారి చెప్పండి. తర్వాత నేను ఎంత పెంచానో కూడా సెలవివ్వండి. నా రెమ్యూనరేషన్ వ్యవహారమంతా మా అమ్మ.. మేనేజర్ చూసుకుంటారు. ఆ డబ్బు వ్యవహారాలు నాకు అర్థం కావు. నేను పట్టించుకోను’’ అని అంది. సినిమాలతో పాటు బయట కూడా ఎక్స్ పోజింగ్ చేస్తానన్న కామెంట్లపై హెబ్బా రెస్పాండైంది. సినిమాల్లో పాత్రలకు తగ్గట్లుగా అందంగా కనిపించాల్సి ఉంటుందని.. బయట చుడీదార్లతో వెళ్తే ఫ్యాషన్ తెలియదంటారని.. తన గురించి కామెంట్ చేసేవాళ్లు.. తాను ఏమేం వేసుకోవాలో లిస్టు ఇస్తే అది దగ్గర పెట్టుకుని డ్రెస్ చేసుకుంటానంటూ సెటైర్ వేసింది హెబ్బా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News