కుమారికి అతనితో డేటింగ్ చేయాలని ఉందట

Update: 2016-11-15 19:30 GMT
కుమారి 21ఎఫ్ తో టాలీవుడ్ ఆడియన్స్ మదిని మెలికలు తెప్పేసిన బ్యూటీ హేభా పటేల్. కుమారితో హిట్ ట్రాక్ ఎక్కిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ఈడో రకం ఆడోరకం మూవీతో మరో సక్సెస్ ను అందుకుంది. ప్రస్తుతం నిఖిల్ కి జోడీగా 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రంలో నటించగా.. ఈ శుక్రవారమే చిన్నోడితో కలిసి ఈ చిన్నది థియేటర్లకు వచ్చేస్తోంది.

ఎక్కడికి పోతావు చిన్నవాడా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న హేభాపటేల్ కు.. ఓ టిపికల్ క్వశ్చన్ ఎదురైంది. 'డేట్ కి వెళ్లాలంటే నిఖిల్.. రాజ్ తరుణ్.. ఇద్దరిలో ఎవరిని ఎంచుకుంటారు?' అనే ప్రశ్నకు.. అమ్మడు ఇచ్చిన ఆన్సర్ షాకింగ్ గా ఉంది. నిజానికి ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో భాగంగా వచ్చిన ఈ ప్రశ్నకు.. పాస్ అంటూ జవాబు దాటేసే అవకాశం ఉన్నా.. హేభ మాత్రం టక్కుమని 'రాజ్ తరుణ్' అంటూ ఆన్సర్ ఇచ్చేసింది. సరిగ్గా ఇక్కడే అమ్మడు తన మనసులో మాట చెప్పేసిందని అంటున్నారు టాలీవుడ్ జనాలు.

హేభా పటేల్ నటించగా హిట్ సాధించిన రెండు సినిమాల్లోనూ రాజ్ తరుణే హీరో. ఈడో రకం ప్రమోషన్స్ టైమ్ లో ఇద్దరూ కాస్త ఎడమొగం పెడమొగంగా కనిపించారు కానీ.. తర్వాత మళ్లీ అన్నీ సెట్ అయిపోయాయనే టాక్ ఉంది. ఇప్పుడు డైరెక్టుగానే రాజ్ తరుణ్ తో డేట్ అంటూ హేభా పటేల్ చెప్పేయడంతో.. ఇద్దరి మధ్యా ఏదో ఉందనే వాదనలకు మరింత బలం వచ్చేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News